జియో‌కు షాక్: రూ.198లకే రోజూ 1 జీబీ డేటా, ఉచిత కాల్స్, ఏపీ, తెలంగాణకే

న్యూఢిల్లీ: రిలయన్స్ జియోకు పోటీగా ఎయిర్‌టెల్ మరో కొత్త ఆఫర్‌ను తీసుకు వచ్చింది. ఈ ఆఫర్ ఏపీ , తెలంగాణ రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన కష్టమర్లకు మాత్రమేనని ఎయిర్‌టెల్ ప్రకటించింది. రూ.198 రీ ఛార్జీ చేస్తే 28 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుందని ఎయిర్‌టెల్ ప్రకటించింది.

Recommended Video

    Airtel New Offers Vs Reliance Jio : War Of Offers - Oneindia Telugu

    రిలయన్స్ జియో తీసుకువచ్చిన ఆఫర్లకు పోటీగా ఇతర టెలికం కంపెనీలు కూడ కొత్త కొత్త ఆఫర్లను ముందుకు తీసుకువస్తున్నాయి. ఇందులో భాగంగానే ఎయిర్ టెల్ కూడ కొత్త ఆఫర్‌ను ముందుకు తీసుకు వచ్చింది.

    రిలయన్స్ జియో కొత్త కొత్త ఆఫర్లతో ముందుకు వస్తుండడంతో ఇతర టెలికం కంపెనీలు కూడ ఆఫర్లను మార్చుకోవాల్సిన పరిస్థితులు అనివార్యంగా మారాయి. జియో టారిఫ్ ప్లాన్లను మార్చినప్పుడు ఎయిర్‌టెల్ కూడ తన ప్లాన్లను మార్చుతోంది. జియో వైపు తమ కష్టమర్లు వెళ్ళకుండా ఎయిర్‌టెల్ ప్లాన్ చేస్తోంది.

     రూ.198కే రోజుకు 1 జీబీ డేటా

    రూ.198కే రోజుకు 1 జీబీ డేటా

    రూ.198లకే రోజుకు 1 జీబీ డేటాను ఇవ్వనున్నట్టు ఎయిర్‌టెల్ ప్రకటించింది. 28 రోజులపాటు చెల్లుబాటు అయ్యేలా ప్రత్యేకమైన, ఆకర్షణీయమైన డేటా ప్లాన్‌ అందిస్తోంది. ప్రీపెయిడ్ కస్టమర్లకు ఈ ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది.రోజుకి 1 జీబీ, 3జీ/4జీ డేటా, అన్‌ లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయాలతో ఈ ప్లాన్ అందిస్తోంది.

     ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకే

    ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకే

    రూ. 198 ప్లాన్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకే వర్తింపజేయనున్నట్టు ఎయిర్‌టెల్ ప్రకటించింది. గతంలో తరహలో అన్ని ప్రాంతాల్లో ఈ ప్లాన్ వర్తింపజేయబోమని ఎయిర్‌టెల్ ప్రకటించింది. అయితే అందరికీ ఈ ప్లాన్ వర్తించదు. అయితే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన కష్టమర్లకు మాత్రమే వర్తింపజేయనున్నారు.

     ఎయిర్‌టెల్ యాప్ ద్వారా తెలుసుకోవాలి

    ఎయిర్‌టెల్ యాప్ ద్వారా తెలుసుకోవాలి

    ఈ ప్లాన్‌‌కి అర్హులో కాదో తెలుసుకోవడానికి ఎయిర్‌‌టెల్ వినియోగదారులు మై ఎయిర్‌టెల్‌యాప్‌ ద్వారా చెక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేకపోయినప్పటికి మై ఎయిర్‌టెల్‌ యాప్‌లో బెస్ట్‌ ఆఫర్స్‌ ఫర్‌ యూ లో రూ.198 ఆఫర్‌ కనిపిస్తోంది.

    టెలికం కంపెనీల టారిప్ వార్

    టెలికం కంపెనీల టారిప్ వార్

    టెలికం కంపెనీల మధ్య టారిప్ వార్ కొనసాగుతోంది. జియో పోటీని తట్టుకొనేందుకు వీలుగా ఇతర టెలికం కంపెనీలు కూడ తమ టారిఫ్‌ను మార్చుతున్నాయి. అయితే జియో తరహలోనే ఇతర టెలికం కంపెనీలు కూడ పోటీని తట్టుకొనేలా తమ వ్యూహలను మార్చుకొంటున్నాయి. జియో ఫీచర్ ఫోన్ల తరహలోనే ఎయిర్‌టెల్, ఐడియా, వోడాఫోన్లు కూడ తక్కువ ధరకే ఫోన్లను కూడ అందుబాటులోకి తెస్తున్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+