కేవలం రూ.9కే..: ఎయిర్‌టెల్ అన్‌లిమిటెడ్ రీచార్జ్ ప్యాక్..
ముంబై: టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్, రిలయన్స్ జియోకు ధీటైన పోటీనిస్తోంది. కొత్తగా రూ.9తో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, డేటా, ఎస్‌ఎంఎస్ ప్యాక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ ప్యాక్ వాలిడిటీ కేవలం ఒక్కరోజు మాత్రమే.
రిలయన్స్ జియో రూ.19 ప్లాన్‌కు కౌంటర్‌గా ఎయిర్‌టెల్ ఈ రూ.9 రీఛార్జ్ ప్యాక్‌ను తీసుకొచ్చింది. జియో అందిస్తున్న రూ.19 ప్యాక్ ద్వారా అన్‌లిమిటెడ్ కాల్స్, 20 ఎస్‌ఎంఎస్‌లు, 150ఎంబీ డేటాను వినియోగదారులు పొందుతున్నారు. కానీ ఎయిర్‌టెల్ మాత్రం రూ.9కే ఇంతకన్నా మెరుగైన ప్యాక్ అందిస్తోంది.

ఇక రూ.23తో మరో ప్యాక్ కూడా అందిస్తోంది ఎయిర్‌టెల్. ఈ ఆఫర్ ద్వారా అపరిమిత వాయిస్ కాల్స్, 200 ఎంబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లను రెండు రోజుల పాటు పొందవచ్చు.
ఎయిర్‌టెల్ మొబైల్ అప్లికేషన్ లేదా వెబ్‌సైట్ ద్వారా కస్టమర్లు ఈ రూ.9 ప్యాక్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. కోంబో ఆఫర్ సెక్షన్ కింద ఈ కొత్త ఆఫర్ అందుబాటులో ఉంది. ఎయిర్ టెల్ రూ.98ప్యాక్ కూడా కస్టమర్లను ఆకర్షిస్తోంది. ఈ ఆఫర్‌తో అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 1జీబీ 4జీ డేటాను 28రోజుల పాటు పొందవచ్చు.












Click it and Unblock the Notifications