రిలయన్స్ జియో కు పోటీగా ఐడియా, ఎయిర్ టెల్ టెలినార్ బంపర్ ఆఫర్లు
రిలయన్స్ జియో కారణంగా ఇతర టెలికం కంపెనీలు కూడ ఆఫర్ల బాట పట్టాయి. రిలయన్స్ తాజాగా ప్రకటించిన ధనాధన్ ఆఫర్ కు పోటీగా మరిన్ని ఆఫర్లను ముందుకు తెచ్చాయి టెలికం కంపెనీలు.
న్యూఢిల్లీ:రిలయన్స్ జియో కారణంగా ఇతర టెలికం కంపెనీలు కూడ ఆఫర్ల బాట పట్టాయి. రిలయన్స్ తాజాగా ప్రకటించిన ధనాధన్ ఆఫర్ కు పోటీగా మరిన్ని ఆఫర్లను ముందుకు తెచ్చాయి టెలికం కంపెనీలు.
ఆరుమాసాల పాటు ఉచిత ఆఫర్లతో ముందుకు వచ్చిన రిలయన్స్ జియో ఇతర టెలికం కంపెనీలకు చుక్కలు చూపిస్తోంది. ఉచిత ఆఫర్ ముగియగానే తమ కస్టమర్లు చేజారకుండా జాగ్రత్తలు తీసుకొంది.
మరో వైపు కొత్త కొత్త ఆఫర్లను ప్రకటిస్తూ ప్రత్యర్థి టెలికం కంపెనీలకు చుక్కలు చూపిస్తోంది రిలయన్స్ జియో.అయితే రిలయన్స్ జియో ఇస్తోన్న ఆఫర్లతో కొత్త ఆఫర్లను ప్రకటించాల్సిన పరిస్థితి అనివార్యంగా ఇతర టెలికం కంపెనీలకు ఏర్పడింది.
ఈ పరిస్థితుల నేపథ్యంలో రిలయన్స్ జియో తరహాలోనే ఇతర టెలికం కంపెనీలు కొత్త ఆఫర్లతో కస్టమర్ల ముందుకు వస్తున్నాయి.కొత్త కొత్త ఆఫర్లతో కస్టమర్లను తమ వైపుకు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తున్నాయి.

రూ.297 రీఛార్జీతో 70 రోజులపాటు 1 జీబీ డేటా ఇస్తోన్న ఐడియా
రూ.297లతో రీఛార్జీ చేసుకొంటే రోజుకు 1 జీబీ డేటా, 70 రోజుల పాటు 4 జీబీ డేటాను ఇవ్వనున్నట్టు ఐడియా ప్రకటించింది. 4జీ స్మార్ట్ ఫోన్ లేని వారకి రోజుకు 300 నిమిషాల పాటు లేదా వారానికి 1200 నిమిషాలపాటు ఉచిత కాల్స్ ను ఇవ్వనున్నట్టు ఐడియా ప్రకటించింది. రూ.447 ప్రీపెయిడ్ రీచార్జీతో 70 రోజుల పాటు 1 జీబీ డేటా , అన్ని నెట్ వర్క్ లకు ఉచిత కాల్స్ ఇవ్వనున్నట్టు ఐడియా ప్రకటించింది.

వోడాఫోన్ రోజుకు 1 జీబీ డేటా
ఇక వోడాఫోన్ రోజుకు 1 జీబీ డేటా ఆఫర్ ను ప్రకటించింది. రూ.352 తో రీ చార్జీ చేసుకోవడం ద్వారా 56 రోజులపాటు రోజుకు 1 జీబీ చొప్పున 4జీబీ డేటాను అందించనుంది. ఈ సమయంలో అపరిమిత ఉచిత లోకల్ , ఎస్టీడీ కాల్స్ ను కూడ అందించనున్నట్టు ప్రకటించింది వోడాఫోన్.

టెలినార్ అపరిమిత ఆఫర్
30 రోజుల కాలపరిమితితో రూ73 లతో ఫస్ట్ రీచార్జ్ తో అన్ లిమిటెడ్ 4జీ లేదా 2 జీ డేటాను ఆఫర్ చేస్తోంది టెలినార్.ఎస్టీడీ కాల్స్ ను సైతం నిమిషానికి 25 పైసలకే 90 రోజుల పాటు చేసుకోవచ్చు. లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో రూ.25 టాక్ టైమ్ అందుకోవచ్చు. మరో 28 రోజులపాటు అన్ లిమిటెడ్ డేటా ఆఫర్ పొందాలంటే కస్టమర్లు రెండో నెలలో రూ.47 రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రయోజనాల కోసం ఎఫ్ఆర్ రీచార్జ్ చేసిన 120 రోజుల్లోనే రూ.47 రీచార్జ్ చేయాలి. 120 రోజుల తర్వాత చేసే రూ.47 రీచార్జ్ తో 28 రోజుల కాలపరిమితితో 400 ఎంబీ 4జీ డేటా ఇస్తారు.

10 జీబీ ఎయిర్ టెల్ ఉచిత డేటా
రిలయన్స్ జియో దెబ్బకు ఎయిర్ టెల్ మరో ఉచిత ఆఫర్ ను ముందుకు తెచ్చింది. రిలయన్స్ అద్భుత ఆఫర్లతో కస్టమర్లను పెంచుకొంటూపోతోంది.అయితే ఎయిర్ టెల్ తన కస్టమర్లకు 10 జీబీ ఉచిత డేటాను ప్రకటించింది.మూడు మాసాల పాటు ఉచితంగా 30 జీబీని అందించనున్నట్టు ప్రకటించింది.












Click it and Unblock the Notifications