ఐశ్వర్యరాయ్‌కు యాడ్ తెచ్చిన తంట: బాలల హక్కుల సంఘాల నిరసన...!
హైదరాబాద్: కళ్యాణ్ జ్యూయలర్స్‌కు సంబంధించిన ఒక యాడ్, ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్‌కు మహిళా ఉద్యమ కార్యక్తరల నుంచి నిరసన ఎదురయ్యేలా చేసింది. ఐశ్వర్యరాయ్ బచ్చన్ బోలెడన్ని నగలు ధరించి, అందంగా హుందాగా దీవాన్‌పై వెనక్కి వాలి ఉన్న దృశ్యం... చూడ్డానికి చాలా ముచ్చగా ఉంది.
కానీ, ఆమె వెనకాల బాగా నీరసించిపోయి, నల్లని రంగుతో దుర్భలంగా ఉన్న ఓ చిన్నారి ఆమెకు గొడుగుపడుతున్న వైనాన్ని గమనించారా? ఈ యాడ్‌పై మహిళా ఉద్యమ కార్యక్తరల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి.

ఈ యాడ్ బాలకార్మిక వ్వవస్ధను సమర్ధించేదిగా ఉందంటూ ఐశ్వర్యరాయపై బాలల హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ మాజీ ఛైర్‌పర్సన్ నేతృత్వంలోని ఒక బృందం దీనిని నిరసిస్తూ ఐశ్వర్యరాయ్ కి ఒక బహిరంగ లేఖ రాసింది.
సంబంధిత ఆభరణాల వారికి జాతీయ ప్రచారకర్తగా ఉండరాదంటూ ఐశ్వర్యరాయ్‌ని కోరింది. వారి బహిరంగ లేఖకు ఐశ్వర్యరాయ్ స్పందిస్తూ.... ఆ ఫోటోషూట్ జరిగినప్పుడు తీసిన అసలు చిత్రాన్ని వారికి పంపుతూ... ఆ యాడ్ తీసిన క్రియేటివ్ సిబ్బంది చిన్నారిని తర్వాత కలిపారని పేర్కొంది.

ఈ విషయాన్ని క్రియేటివ్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్తానని చెప్పింది. అంతే కాదు ఆ యాడ్‌కి సంబంధించిన కోణాన్ని తమ దృష్టికి తెచ్చినందుకు ధన్యవాదాలు తెలిపింది. ఐశ్వర్యరాయ్ యాడ్‌కు సంబంధించిన ట్విట్టర్‌లో కొంత మంది చేసిన ట్వీట్స్ పాఠకులకు ప్రత్యేకం.
Black kid holdin umbrella to d great Aishwarya Rai.Kalyan Jewellers has lost this one completly by promoting slavery! pic.twitter.com/7Gu1GSTC53
— Prashanth (@itisprashanth) April 22, 2015 Sickening Racist Ad of black slave child & Aishwarya Rai @KalyanJewellers shame on you #boycottKalyanJewellers http://t.co/YBovs3lxIy
— Dharini Parthasaraty (@dharinipart) April 22, 2015 Deeply disappointed by Aishwarya Rai + @kalyanjewellers for this racist ad promoting child labour. http://t.co/9tzb0fQDpC via @scroll_in
— Parmesh Shahani (@parmeshs) April 22, 2015 











Click it and Unblock the Notifications