విజయ్ మాత్రమే కాదు.. నెగెటివ్‌గా రాయడం చూసి షాకయ్యా - స్టార్ హీరో అజిత్
తమిళనాడు రాష్ట్రం లోని కరూర్ లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన దేశ వ్యాప్తంగా విషాదాన్ని నింపింది. టీవీకే పార్టీ అధ్యక్షుడు, స్టార్ హీరో విజయ్ ర్యాలీలో ఈ దుర్ఘటన జరిగింది. మొత్తం 41 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయాలపాలయ్యారు. అయితే ఈ ఘటనపై కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ స్పందించడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అజిత్ పలు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. విషాదం నింపిన ఆ ఘటనలో ఒక్కరే కాకుండా అందరూ బాధ్యులేనని అభిప్రాయపడ్డారు. ఎవరినీ తక్కువ చేయడం తన ఉద్దేశం కాదని.. కానీ ఇలాంటి ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకు మనందరం కూడా బాధ్యులమేనని.. ముఖ్యంగా మీడియా వీటిపై అవగాహన కలిగించాలని అన్నారు.

అంతే కాకుండా ఇలాంటి గందరగోళ పరిస్థితులు కేవలం సినీతారల సభల్లోనే ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. క్రికెట్ మ్యాచ్ చూడడానికి లక్షల మంది వెళ్తారని.. కానీ వారంతా సురక్షితంగా తిరిగి వస్తారన్నారు. అదే థియేటర్‌లో మాత్రం పరిస్థితి వేరుగా ఉంటుందని ఇలా ఎందుకు జరుగుతోంది? దీనివల్ల పరిశ్రమకు చెడ్డ పేరు వస్తుందని ఆయన ప్రశ్నించారు.
మరోవైపు అభిమానుల చర్యల వల్ల కలిగే ప్రమాదాలను కూడా అజిత్ వివరించారు. తన పిల్లలు వారి స్కూల్ దగ్గరికి రావాలని కోరతారని.. కానీ ఒక్కరోజు కూడా వారిని డ్రాప్ చేయడానికి వెళ్లలేదని చెప్పుకొచ్చారు. ఎందుకంటే తాను కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే కనీసం 50, 60 మంది బైక్‌పై ఫాలో అయ్యి ఫోటో కావాలని అడుగుతారని పేర్కొన్నారు. అందువల్ల ఒక్కోసారి అందరి జీవితాలు రిస్క్‌లో పడతాయని వివరించారు. కారులో నుంచి ఫోటోలు ఇచ్చినప్పుడు తన చేతికి గాయాలైన సందర్భాలు ఎన్నో ఉన్నాయని గుర్తుచేసుకున్నారు.
#Ajithkumar about KARUR STAMPEDE:
— AmuthaBharathi (@CinemaWithAB) October 31, 2025
"There are so much happening in TN because of the stampede. That individual (@actorvijay) itself is not responsible. We all are responsible. We become so obsessed with crowd. It projects whole film industry in Bad light"pic.twitter.com/72idEuXJPe
ఇక అజిత్ కెరీర్ గురించి చెబుతూ.. తనను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు అభిమానులకు రుణపడి ఉంటానని అన్నారు. తన భార్య సపోర్ట్ లేకపోతే ఈ స్థాయిలో ఉండేవాడిని కాదని వెల్లడించారు. 2021 తమిళనాడు ఎన్నికల సమయంలో తనపై వచ్చిన ఒక వార్త గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్లిన సందర్భంలో.. సెలబ్రిటీలందరినీ క్యూ లైన్‌లో ఉన్న ఒక వ్యక్తి ఫోటోలు తీస్తున్నాడన్నారు. పోలింగ్ కేంద్రంలో ఫోన్‌లు ఉపయోగించడానికి వీల్లేదని ఉన్నందుకు అతడి ఫోన్ తీసుకొని సిబ్బందికి ఇచ్చానన్నారు. కానీ అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశానని నెగెటివ్‌గా రాయడం చూసి షాక్ అయ్యానంటూ చెప్పారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications