అజిత్ తో సీఎం విజయ్, ఫ్యాన్స్ కు సర్‌ప్రైజ్ ట్రీట్ - 30 ఏళ్ల పోటీకి తెర.. ఇక నుంచి..!!
అరుదైన కలయిక. తమిళనాడు సీఎం విజయ్ కోలీవుడ్ అగ్ర హీరో అజిత్ కుమార్ (ఏకే) తమ ఫ్యాన్స్ సర్‌ప్రైజ్ ట్రీట్ ఇచ్చారు. సిల్వర్‌స్టోన్ సర్క్యూట్‌లో విజయ్ పరుగెత్తుకుంటూ వచ్చి అజిత్‌ను గట్టిగా ఆలింగనం చేసుకున్న దృశ్యం సోషల్ మీడియాలో శరవేగంగా వైరల్ అవుతోంది. తమిళనాడు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్ యూకే పర్యటనకు వెళ్లగా, ఈ రేసింగ్ టోర్నీ సందర్భంగా అజిత్ ఆయనకు స్వయంగా స్వాగతం పలికటం ఆసక్తిగా మారింది.
సీఎం విజయ్ - అజిత కలయిక ఇప్పుడు సంచలనంగా మారింది. వెండితెరపై ప్రత్యర్థులుగా, బయట స్నేహితులుగా ఉండే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, కోలీవుడ్ స్టార్ హీరో, రేసర్ అజిత్ కుమార్ ఒకరినొకరు ఆప్యాయంగా కలుసుకున్నారు. బ్రిటన్‌లోని ప్రసిద్ధ సిల్వర్‌స్టోన్ రేసింగ్ సర్క్యూట్‌లో రేసింగ్ అనంతరం అజిత్ కుమార్, విజయ్‌ను ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా విజయ్‌కి 'టీవీకే' (TVK) పార్టీ రంగులను పోలిన ప్రత్యేకమైన రేసింగ్ సూట్‌ను అజిత్ బహుమతిగా అందించారు. కేవలం బహుమతితో సరిపెట్టకుండా, రేసింగ్ పట్ల మక్కువ ఉన్న అజిత్... విజయ్‌తో కలిసి సిల్వర్‌స్టోన్ ట్రాక్‌పై స్వయంగా కారులో నాలుగు లాప్‌లు చక్కర్లు కొట్టారు.
విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఇద్దరు దిగ్గజ స్టార్లు ఇలా ఒకే వేదికపై, అత్యంత స్నేహపూర్వక వాతావరణంలో కనిపిచడం కోలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

విజయ్ పై అజిత్ ప్రశంసలు
అయితే.. దశాబ్దాలుగా బాక్సాఫీస్ వద్ద పోటీదారులుగా ఉన్నప్పటికీ, నిజ జీవితంలో వీరిద్దరూ చూపిన ఈ ఆప్యాయత ఇరు వర్గాల అభిమానులను భావోద్వేగానికి గురిచేస్తోంది. సోషల్ మీడియాలో ఈ అరుదైన క్షణాలకు సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి. బిజీ షెడ్యూల్‌లోనూ తన రేసింగ్ ఈవెంట్‌కు విచ్చేసిన దళపతి విజయ్‌కి అజిత్ కృతజ్ఞతలు తెలిపారు. గత 34 ఏళ్లుగా మేము తమిళ సినీ పరిశ్రమలో సహచరులుగా ప్రయాణించామని.. విజయ్ ముఖ్యమంత్రి స్థానానికి చేరుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అజిత్ వ్యాఖ్యానించారు. 1992లో 'నాళైయ తీర్పు' సినిమాతో విజయ్, 1993లో 'అమరావతి'తో అజిత్ హీరోలుగా రంగప్రవేశం చేశారు. 3 దశాబ్దాలుగా (30 ఏళ్లు) వీరిద్దరి సినిమాలు థియేటర్లలో పోటీ పడుతుంటే అభిమానులు సోషల్ మీడియాలో 'అనిల్స్' (విజయ్ ఫ్యాన్స్), 'ఆమైస్' (అజిత్ ఫ్యాన్స్) అని సరదా పేర్లతో హంగామా చేసేవారు. ఇప్పుడు ఇద్దరి కలయిక సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.













Click it and Unblock the Notifications
