'ఫైలట్ మహిళ అయితే జరిగేది ఇదే'.. అజిత్ పవార్ సంచలన ట్వీట్ వైరల్

మహారాష్ట్రలోని పూణెలో జరిగిన విమాన ప్రమాదంలో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ అజిత్ పవార్ మరణించారు. విమానం ల్యాండ్ అవుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిన నేపథ్యంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ తో సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇక విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆకస్మిక మరణంపై పలువురు సంతాపం తెలిపారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

అయితే విమాన ప్రయాణాలపై అజిత్ పవార్ గతంలో చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. " మనం హెలికాప్టర్ లో గానీ విమానంలో గానీ ప్రయాణించే సమయంలో.. మన హెలికాప్టర్ కానీ విమానం కానీ స్మూత్ గా ఎలాంటి సమస్య లేకుండా ల్యాండ్ అయితే.. అప్పుడు ఆ పైలట్ మహిళ అని మనం గ్రహించాలి" అని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ ను అజిత్ పవార్ 2024 జనవరి 18 న పోస్టు చేశారు. ఈ ట్వీట్ కు ఎన్సీపీ వుమెన్ పవర్ అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా జత చేశారు.

ఈ ట్వీట్ ప్రకారం అజిత్ పవార్ ఉద్దేశం ఏంటంటే.. పైలట్ మహిళ అయితే ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా తమ నైపుణ్యం, దృష్టిని కేంద్రీకరించి విమానాన్ని స్మూత్ గా ల్యాండింగ్ చేస్తారు అని స్పష్టం అవుతోంది. అయితే ఈ ట్వీట్ పోస్టు చేసి రెండేళ్లు దాటినా ఇప్పుడు ట్రెండింగ్ లోకి రావడానికి కారణం.. తాజాగా అజిత్ పవార్ మృతి చెందిన విమానాన్ని కూడా ఓ మహిళా పైలట్ నడపడమే అని తెలుస్తోంది.

ajitpawar 2024 Tweet Resurfaces After Fatal plane Crash Smoother Landing If Pilot is a Woman

బారామతి వద్ద జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందిన వారిలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తో పాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పాయారు. వారిలో యువ పైలట్ కెప్టెన్ శాంభవి పాథక్ ఒకరు. ప్రస్తుతం ప్రమాదం జరిగిన విమానంలో శాంభవి ఫస్ట్ ఆఫీసర్ గా ఉన్నారు. ఇక ఈ విమానంలో పైలట్ ఇన్ కమాండ్ గా కెప్టెన్ సుమిత్ కపూర్ వ్యవహరించారు. దురదృష్టవశాత్తు వీరంతా ఈ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+