ఫుల్ రొమాన్స్ మూడ్‌లో ఆకాశ్ అంబానీ: లిప్‌లాక్ వీడియో వైరల్, ఎవరితోనో తెలుసా?
ముంబై: భారత కుబేరుడు ముకేష్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ వివాహం మార్చి 9న శ్లోకా మెహతాతో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు అంబానీ, శోకా మెహతా తరపు కుటుంబసభ్యులు, బంధువులతోపాటు బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నేతలు కూడా హాజరయ్యారు.

మెరిసిపోయారు..
ముకేష్ అంబానీ, నీతా అంబానీల పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ. వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా, మోనా మెహతాల చిన్న కూతురు శ్లోకా మెహతా. ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతాలు వారు ధరించిన ఫ్యాషన్ వస్త్రాల్లో మెరిసిపోయారు.

అందరి ఎదుటే..
అయితే, ఈ వివాహ వేడుకల నాటి ఓ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. కుటుంబసభ్యులు, బంధువులు, వేడుకకు వచ్చిన వారి ఎదుటే.. ఆకాశ్ అంబానీ.. శ్లోకా అంబానీకి ముద్దు పెట్టుకున్నాడు. అదీ శ్లోకా మెహతా పెదవుల మీద.
శ్లోకా నడుముపై చేయి వేసి పెదాలపై ముద్దు..
అచ్చం సినిమాల్లోలానే ఆకాశ్ అంబానీ.. శ్లోకా మెహతాకు పెదాలపై ముద్దు పెట్టడం విశేషం. శ్లోకా నడుముపై చేయి వేసిన ఆకాశ్.. ఆమెను అలా కిందివైపు వంచి ఆమె పెదాలపై ఒక్కసారిగా ముద్దు పెట్టాడు. ఆ తర్వాత ఇద్దరు చిరునవ్వులు చిందించారు.

ముద్దు.. ముద్దు అంటూ..
అయితే, అంతకుముందు ఆకాశ్, శ్లోకా మెహతాలు కలిసి నడుస్తుండగా.. కొందరు యువతీయువకులు ‘వియ్ వాంట్ కిస్.. వియ్ వాంట్ కిస్' అంటూ కేకలు వేశారు. ఈ క్రమంలోనే శ్లోకా మెహతాకు ముద్దు ఇచ్చాడు ఆకాశ్ అంబానీ. ముద్దు ఇచ్చిన తర్వాత కుటుంబసభ్యులకు దగ్గరకు వెళ్లిన ఆకాశ్ అంబానీ.. మరొకరి సవాల్ విసిరినట్లు తెలుస్తోంది.

శ్లోకా మెహతాపై ఇషా అంబానీ ఇలా..
ఆకాశ్, అతని సోదరి ఇషా అంబానీకి శ్లోకా మెహతా చిన్ననాటి స్నేహితురాలు. పెరిగి పెద్దవుతున్న క్రమంలో ఆకాశ్, శ్లోకాల మధ్య ప్రేమ చిగురించింది. ఆ ప్రేమే పెళ్లికి దారితీసింది. తన సోదరుడు ఆకాశ్‌ను శ్లోకా బాగా చూసుకుంటుందని ఇషా ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం. కాగా, ఆకాశ్, శ్లోకాల వివాహం సందర్భంగా ఇషా, ఆనంద్ పిరమాళ్ ఓ రాజభవనంను కానుకగా ఇచ్చారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications