‘ఆకాశ్’కి అంతసీను ఉందా? చైనాను అడ్డుకోగలదా?: ఏకిపారేసిన‘కాగ్’

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆకాశ్ క్షిపణి గురించి పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) ఏకిపారేసింది. ఈ క్షిపణికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన అంశాలను కాగ్ బహిర

న్యూఢిల్లీ: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆకాశ్ క్షిపణి గురించి పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) ఏకిపారేసింది. ఈ క్షిపణికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన అంశాలను కాగ్ బహిర్గతం చేసింది.

చైనా నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆకాశ్ క్షిపణులను ఈశాన్య రాష్ట్రాల్లో మోహరించాలని 2010లో కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. 2013 జూన్ నుంచి 2015 డిసెంబర్ మధ్య కాలంలో ఈశాన్య రాష్ట్రాల్లోని ఆరు ప్రాంతాల్లో బేస్ లను ఏర్పాటు చేసి, ఆకాశ్ స్క్వాడ్రన్ ను ఏర్పాటు చేసి, దానిని చైనా వైపు గురిపెట్టి ఉంచాలని ఆదేశాలు జారీ చేస్తూ, 3,619 కోట్ల రూపాయలను కూడా కేటాయించారు.

Akash missile reported 30 percent failure rate: CAG

అయితే ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి ప్రయత్నం జరగలేదని కాగ్ తెలిపింది. అందుకు కారణాలను కూడా వివరించింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆకాశ్ క్షిపణులను డీఆర్డీఏ డిజైన్ చేయగా.. వాటి తయారీని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) చేపట్టింది. అయితే బీఈఎల్ తయారు చేసిన ఆకాశ్ క్షిపణుల్లో మూడింట ఒక వంతు క్షిపణులు ప్రయోగం దశలో విఫలమయ్యాయట.

దీంతో వీటిని ఏర్పాటు చేయడం వల్ల ఉపయోగం ఉంటుందా? అన్న అనుమానంతో వాటిని ఏర్పాటు చేయడంలో జాప్యం చేశారని కాగ్ వెల్లడించింది. మరోవైపు బేస్ ల నిర్మాణంలో జాప్యం వల్లే ఇప్పటి వరకు ఎలాంటి ఏర్పాట్లు జరగలేదని కాగ్ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+