పొత్తులొద్దు బాబాయ్..! ఉప ఎన్నికల్లో ఒంటరిగానే వెళ్తామన్న అఖిలేష్ యాదవ్..!!
లక్నో/హైదరాబాద్ : ఎన్నికల్లో అన్ని ప్రయోగాలు ముగిసిపాయాయి. పొత్తులతో పార్టీలు చిత్తయ్యాయి. అనైతిక పొత్తులతో రాజకీయ పార్టీలు ఉనికిని కొల్పోయే ప్రమాదంలో పడ్డాయి.ఎన్నికలు ఐపోయిన తర్వాత గానీ ఈ వాస్తవాలు రాజకీయ నాయకులకు తెలిసనట్టు లేదు. ఎన్నికల్లో ప్రజలకు తామేం చేస్తామో చెప్పడం మర్చిపోయి ఇతర పార్టీల పై దుమ్మెత్తి పోయడాన్ని జనం జీర్ణించుకోలేక పోయారు.
అందుకు బలమైన ప్రాంతీయ పార్టీలను సైతం ప్రజలు ఘోరంగా ఓడించారు. ఇక ఉత్తర ప్రదేశ్ లో మొన్నటి వరకూ అదికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ మొదట కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని అనూహ్యంగా ఓటమి పాలయ్యింది. ఆతర్వాత జరిగిన సార్వత్రిక ెన్నికల్లో బహుజన సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుని ఉన్న ఆదిఖ్యాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. దీంతో భవిష్యత్తులో పొత్తు అంటేనే ఝడుసుకునే పరిస్థితులు తలెత్తాయి.

దీంతో ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికలలో తాము కూడా ఒంటరిగానే బరిలోకి దిగుతామని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి రాబోయే ఉప ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తాం అని తేల్చి చెప్పేయడంతో ఎస్పి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఒకవేళ తమ బంధం తెగదెంపులు అయితే.. దానిపై లోతుగా విశ్లేషణ చేస్తామన్నారు. రాబోయే ఉప ఎన్నికల కోసం తాము సిద్ధమవుతున్నామని, 11 సీట్లలో ఒంటరిగా పోటీ చేస్తామని అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు.
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బిజేపీకి అడ్డు కట్ట వేయాలని జతకట్టిన ఎస్పీ - బీఎస్పీ కూటమి ఘోర విఫలమైన విషయం తెలిసిందే. అఖిలేష్ యాదవ్ ఆదేశాలను ఎస్పీ కేడర్ పాటించలేదని, ఆ పార్టీ నేతలు బీఎస్పీకి ఓట్లేయలేదని మాయావతి పేర్కొన్న విషయం విదితమే. అఖిలేష్ భార్య డింపుల్ యాదవ్‌తో పాటు పార్టీ సీనియర్లు పలువురు కుడా ఘోర ఓటమి చవి చూశారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications