మద్యం లేకుండా పెళ్లి.. రూ. 51 వేలు గిఫ్ట్ గా ఇచ్చిన సర్పంచ్

సాధారణంగా శుభకార్యం అంటే సుక్కా.. ముక్కా కచ్చితంగా ఉండాల్సిందే. ఇక పెళ్లి అంటే మాటలా..? బంధువులు, స్నేహితులు ఎక్కడెక్కడినుంచో వస్తుంటారు. వారికి మర్యాదలు చేయాల్సిందే. అందువల్ల పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యాలయాల్లో మందు, చిందు కచ్చితంగా ఉంటుంది. ఇక తెలంగాణలో అయితే ఏ చిన్న ఫంక్షన్ అయినా ముక్కా.. సుక్కా కన్ఫర్మ్ గా ఉండాల్సిందే. అయితే తాజాగా ఉత్తరాఖండ్ లో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది.

ఫంక్షన్ ఏదైనా చుక్కా.. ముక్కా.. ఉండాల్సిందే.. ఇప్పుడిదే ట్రెండ్.. శుభకార్యం చిన్నదైనా.. పెద్దదైనా ఇవి కచ్చితంగా ఉండాల్సిందే.. రూ. లక్షలు ఖర్చు చేసి ఫంక్షన్స్ ను గ్రాండ్ గా చేస్తారు. చుక్కా.. ముక్కా.. దగ్గర ఏమాత్రం రాజీపడరు. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇవి లేకుండా ఫంక్షన్ జరగదు. అయితే ఓ జంట వీరందరికీ ఆదర్శంగా నిలిచింది. శుభకార్యాల్లో మద్యం అందించడం వల్ల అనవసర ఖర్చులు పెరుగుతున్నాయని.. యువత మద్యానికి అలవాటు పడే ప్రమాదం ఉందని భావించింది. ఈ మేరకు వినూత్న నిర్ణయం తీసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచింది.

ఉత్తరాఖండ్ లోని డోయివాలా నియోజకవర్గం పరిధిలోని గడుల్ గ్రామంలో ఓ జంట ఆదర్శ వివాహం చేసుకుంది. పెళ్లి కార్యక్రమంలో ఎలాంటి మద్యం లేకుండా జాగ్రత్త పడింది. అలా మద్యం లేకుండా పెళ్లి చేసుకున్నందుకు గానూ ఆ జంట నిర్ణయాన్ని ఆ గ్రామ సర్పంచ్ ప్రశంసించారు. ఏకంగా రూ. 51 వేలు గిఫ్ట్‌గా ఇచ్చి గొప్పతనాన్ని చాటుకున్నారు. దాంతో ఆ గ్రామంలో ఇలాంటి శుభకార్యాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

alcohol Free Wedding in Uttarakhand Gadul Village sarpanch Gifts 51 000 as Reward for Simplicity

ఉత్తరాఖండ్ డోయీవాలా నియోజకవర్గ పరిధిలో గడుల్ గ్రామ సర్పంచ్ స్వీటీ రావత్ అందరి దృష్టిని ఆకర్షించారు. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అందరూ గ్రామ సర్పంచ్ స్వీటీ రావత్ చేసిన పనిని ప్రశంసిస్తున్నారు. తమ గ్రామంలో ఎవరైనా మద్యం పంచకుండా పెళ్లి చేసుకుంటే ఆ కుటుంబానికి సహాయం చేస్తానని ప్రకటించారు. అలాగే చెప్పిన విధంగా తాజాగా ఓ జంటకు రూ. 51 వేలు గిఫ్ట్‌ గా ఇచ్చారు. దీంతో సర్పంచ్ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+