అలర్ట్.. అలర్ట్.. మరో 48 గంటల్లో భారీ వర్షాలు
Recommended Video
హైదరాబాద్/ ముంబై : గత రెండురోజుల నుంచి కురుస్తోన్న తేలికపాటి జల్లులతో భాగ్యనగరం తడిసిముద్దయ్యింది. ఉక్కపోతతో అల్లాడుతున్న జనానికి కాస్త స్వాంతన చేకూరింది. అయితే భారత వాతావరణ శాఖ మరో తీపికబురు అందజేసింది. రాబోయే 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. సముద్రం అల్లకల్లోలమై ఉందని .. మత్య్సకారులు చేపల వేటకు వెళ్లొద్దని వాతావారణ శాఖ అధికారులు స్పష్టంచేశారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ముంబైకర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వానలు ఆగి .. కాస్త వెలుతురు రావడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. అయితే వారికి ఆ స్వాంతన ఎంతో సేపు నిలవలేదు. మరో 48 గంటల్లో ముంబైకి వాన గండం ఉందనే కబురు చెప్పింది వాతావరణ శాఖ. ముంబై మహానగరంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని పేర్కొంది. దీంతోపాటు ఛత్తీస్ గఢ్, తెలంగాణ, మధ్య మహారాష్ట్ర, గుజరాత్, విదర్భ, మధ్యప్రదేవ్, నాగాలాండ్‌లో కూడా వర్షాలు కురుస్తాయని అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.

వర్షాలతో పాటు ఉరుములు కూడా వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కుల్లు, మండీ, కంగ్రా, బిలాస్‌పూర్, సిర్‌మౌర్, సోలన్, సిమ్లాలో ఉరుములు వచ్చే అవకాశం ఉందని ... రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో కూడా ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. వర్షాలతో పాటు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించారు. వర్ష ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉందని .. కొద్దిరోజులపాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications