రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక: 6గంటలు ఆ సైట్ పనిచేయదు..

ముంబై: రైల్వే ప్రయాణికులకు ఇదో ముఖ్య ప్రకటన. రైల్వే మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్ సైట్ అయిన ఐఆర్సీటీసీ సేవలు గురువారం రాత్రి 10.45 గంటల నుంచి శుక్రవారం ఉదయం 5 గంటల వరకూ తాత్కాళికంగా నిలిచిపోనున్నాయి. అంటే ఆరు గంటల పాటు ఐర్సీటీసీ సేవలు రైల్వే కస్టమర్లకు అందుబాటులో ఉండవు.

వెబ్ సైట్, యాప్ లను అప్ డేట్ చేసే నిమిత్తం సైట్ ను కొంతసమయం నిలిపివేస్తున్నట్టు ఐర్సీటీసీ ప్రకటించింది. సైట్ నిలుపుదలతో రైల్వే ప్రయాణికులకు కొంత అసౌకర్యం తప్పేలా లేదు. రైల్వే స్టేషన్లలోని ఐవీఆర్ఎస్ టచ్ స్క్రీన్ లతో పాటు కాల్ సెంటర్, 139 విచారణ తదితరాలు కూడా అందుబాటులో ఉండవని, రైల్వే కస్టమర్లు సహకరించాలని ఐర్సీటీసీ విజ్ఞప్తి చేసింది.

Alert! IRCTC website, other online Railway services to remain closed for over six hours tonight

రైల్వే బుకింగ్స్ కు సంబంధించి మరో కొత్త సిస్టమ్ ప్రవేశపెట్టింది రైల్వే. ఇకనుంచి ఐర్సీటీసీ ఈ-వాలెట్ యూజర్స్ సంస్థ యాప్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. తత్కాల్ టికెట్లను కూడా దీని ద్వారా బుక్ చేసుకోవచ్చు. ట్విట్టర్ ద్వారా ఐర్సీటీసీ ఈ విషయాన్ని వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+