పాకిస్థాన్ నుంచి భారత్ లోకి డ్రోన్లు.. కూల్చేసిన సైన్యం

భారత్​- పాకిస్థాన్​ సరిహద్దు వెంట అనుమానంగా సంచరిస్తున్న డ్రోన్​ ను అధికారులు కూల్చివేశారు. ఈ ఘటన నౌషెరా సెక్టార్ పరిధిలోని లైన్ ఆఫ్ కంట్రోల్(LOC) వద్ద జరిగింది. పాకిస్థాన్ నుంచి ఈ డ్రోన్ వచ్చినట్లుగా భారత సైన్యం ప్రాథమికంగా నిర్ధారించింది. మరికొన్ని డ్రోన్ లు సైతం గుర్తించినట్లు పేర్కొంది. అయితే ఆ డ్రోన్ లు విడిచిన ఆయుధాలు, డ్రగ్స్ ను వెతుకుతున్నట్లు అధికారులు తెలిపారు. భారత సైన్యం వివరాల ప్రకారం సాంబా, రాజౌరీ, పూంచ్ జిల్లాలో ఈ డ్రోన్ లు ప్రత్యక్షం అయ్యాయి. దీంతో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు.

భారత్- పాకిస్థాన్ సరిహద్దులోని పలు జిల్లాల్లో డ్రోన్ లు సంచరించడం ఆందోళన కలిగిస్తోంది. నౌషెరా సెక్టార్ పరిధిలోని లైన్ ఆఫ్ కంట్రోల్(LOC) వద్ద ఓ డ్రోన్ ను భారత సైన్యం కూల్చి వేసింది. అయితే జమ్మూ కాశ్మీర్ లోని ఇతర జిల్లాలైన సాంబా, రాజౌరీ, పూంచ్ లోనూ డ్రోన్ లు కనిపించినట్లు భారత సైన్యం పేర్కొంది. ఈ సున్నితమైన ప్రాంతాల్లో సడెన్ గా డ్రోన్లు ప్రత్యక్షం కావడంపై అధికారులు అప్రమత్తమయ్యారు. పాకిస్థాన్ నుంచి ఈ డ్రోన్ లు వచ్చినట్లుగా అనుమానిస్తున్నారు.

అయితే ఈ డ్రోన్ లతో ఆయుధాలు కానీ డ్రగ్స్ కానీ స్మగ్లింగ్ చేస్తున్నట్లు అధికారులు ప్రాథమికంగా నిర్థారించారు. మరోవైపు తాజాగా పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైష్- ఎ-మొహమ్మద్ అధిపతి మసూద్ అజార్‌ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తన వద్ద పెద్ద సంఖ్యలో ఆత్మాహుతి దాడులకు పాల్పడే సూసైడ్ బాంబర్లు ఉన్నారంటూ సంచలన ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ నుంచి డ్రోన్ లు రావడంపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సరిహద్దు ప్రాంతంలో అప్రమత్తమయ్యారు.

Alert on Indo-Pak Border Authorities Shoot Down Suspicious Drone Hovering Over Indian Territory

ఇక మసూద్ అజార్‌.. 2001 పార్లమెంట్ దాడి, 2008 ముంబై దాడులు, 2016 పథాన్ కోట్ దాడులు, 2019 లో పుల్వామా దాడిలో ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. ఆ తర్వాత నుంచి మసూద్ అజార్ బహిరంగంగా కనిపించడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+