భ‌క్తుల‌కు అలర్ట్‌.. కేదార్‌నాథ్ ఆల‌య త‌లుపులు మూసివేత‌..

భ‌క్తుల‌కు ముఖ్య గ‌మ‌నిక‌.. కేదార్‌నాథ్ ఆల‌య త‌లుపులు మూత‌బ‌డ్డాయి. భారతదేశ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కేదార్ నాథ్ ఆలయం తలుపులు మూసివేశారు. శీతాకాలం ప్రారంభం కావడంతో ఆదివారం ఉదయం 8.30 గంటలకు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అనంత‌రం ఆలయ తలుపులను మూసివేశారు. మళ్లీ ఈ ఆల‌య త‌లుపులు ఆర్నెల తర్వాతే తెరచుకోనున్నాయి. ఈ ఆరు మాసాలు ఆలయం పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. అప్పటి వరకూ భ‌క్తులు ఉఖిమఠ్ లోని ఓంకారేశ్వర్ ఆలయంలో భోలే బాబా ఆరాధన, దర్శనం చేసుకోవ‌చ్చు..

నేటి మ‌ధ్యాహ్నం య‌మునోత్రి మూసివేత‌..

దేశంలోని ప్ర‌సిద్ధిచెందిన ఛార్‌ధామ్ ఆల‌యాలు శీతాకాలం ప్రారంభం కావడంతో మూతపడుతున్నాయి. నిన్న (శనివారం) ఛార్‌ధామ్ ఆల‌యాల్లో ఒక‌టైన గంగోత్రి ధామ్ ఆల‌య తలుపులను మూసివేయగా, నేడు (ఆదివారం ) ఉద‌యం కేదార్ నాథ్ ఆలయ త‌లుపుల‌ను ఆల‌య అధికారులు మూసివేశారు. వీటితోపాటు యమునోత్రి ఆలయ తలుపులను కూడా నేటి (ఆదివారం) మధ్యాహ్నం 12.05 గంటలకు మూసివేయనున్న‌ట్లు అధికారులు తెలిపారు.

Alert to devotees Kedarnath temple doors closed

న‌వంబ‌ర్ 17న బ్ర‌దీనాథ్ మూసివేత‌...

ఛార్‌ధామ్ యాత్ర‌లో ఒక‌టైన బ‌ద్రీనాథ్ ఆల‌యం కూడా మూసివేయ‌నున్నారు. బ్ర‌దీనాథ్ ఆల‌యంలో శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్నాడు. ఈ ఆల‌యంలో శీతాకాలంలో పూర్తిగా మంచుతో క‌ప్ప‌బ‌డి ఉంటుంది. అందుకే బద్రీనాథ్ ఆలయాన్ని ఈ నెల (నవంబర్) 17వ తేదీ రాత్రి 9.07 గంటలకు మూసివేయనున్న‌ట్లు ఆల‌య అధికారులు తెలిపారు. చార్ ధామ్ యాత్ర చివ‌రి ద‌శ‌లో ఉంది.

ఈ యాత్ర ఈ ఏడాది మే 10వ తేదిన ప్రారంభ‌మైంది. న‌వంబ‌ర్ 1 (శుక్ర‌వారం)వ తేదిన సుమారు 15 ల‌క్ష‌ల‌మంది భ‌క్తులు గంగోత్రి, యమునోత్రి పుణ్య‌క్షేత్రాలను సందర్శించుకున్న‌ట్లు ఆల‌య అధికారులు పేర్కొన్నారు. ఇక‌, భక్తులు దేశంలోనే ప్ర‌సిద్ధిచెందిన ఈ జ్యోతిర్లింగాలను సందర్శించడ‌మే కాకుండా ప్రత్యేక పూజ‌లు కూడా చేశారు. మళ్లీ వేసవిలోనే ఈ ఆలయాల తలుపులు తెరచుకోనున్న‌ట్లు ఆల‌య అధికారులు వివ‌రించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+