కూతురు పెళ్లి ఆపి అల్లుడితో అత్త జంప్.. కట్ చేస్తే ఊహించని ట్విస్ట్!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘడ్ జిల్లా మడ్రాక్ ప్రాంతంలో వెలుగుచూసిన ఓ సంచలన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. సాధారణంగా అత్తా-అల్లుళ్ల మధ్య బంధాన్ని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. కానీ ఇక్కడ మాత్రం కథ అడ్డం తిరిగింది. తన కూతురికి కాబోయే అల్లుడు రాహుల్‌తో అనిత అనే మహిళ ప్రేమలో పడటమే కాకుండా పెళ్లికి కేవలం 12 రోజుల ముందు అతడితో కలిసి పారిపోవడం గతేడాది(ఏప్రిల్ 2025) పెద్ద సంచలనంగా మారింది. వీరిద్దరూ బీహార్లోని సీతామర్హి జిల్లాకు వెళ్లి అక్కడ గత 10 నెలలుగా భార్యాభర్తల్లా కలిసి జీవించారు.
అల్లుడి ఆరోపణలు.. మరో వ్యక్తితో పరార్
ఈ ప్రేమ వ్యవహారంలో మొదటి ట్విస్ట్ అల్లుడు రాహుల్ ద్వారా వచ్చింది. 10 నెలల సహజీవనం తర్వాత తన అత్త అనిత.. తన సొంత బావతో (రాహుల్ సోదరి భర్త) కలిసి పారిపోయిందని రాహుల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా ఆమె వెళ్లేటప్పుడు తన వద్ద ఉన్న రూ. 2 లక్షల నగదు, విలువైన బంగారు ఆభరణాలను కూడా ఊడ్చుకుపోయిందని, తనను దారుణంగా మోసం చేసిందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశాడు.

అత్త ఎదురుదాడి.. బందీగా ఉంచి మత్తు మందులు:
రాహుల్ ఆరోపణలు చేసిన కొద్ది రోజులకే అనిత స్వయంగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని అసలు నిజాన్ని వెల్లడించింది. తాను ఎవరితోనూ పారిపోలేదని, రాహుల్ బారి నుంచి ప్రాణాలతో బయటపడ్డానని ఆమె పేర్కొంది. మొదట్లో ఒక నెల రోజులు తనను బాగానే చూసుకున్న రాహుల్.. ఆ తర్వాత అసలు స్వరూపాన్ని చూపించాడని ఆమె ఆరోపించింది. తనను గదిలో బంధించి ఎక్కడికీ వెళ్లకుండా మత్తు మందులు ఇస్తూ శారీరకంగా, మానసిక హింసకు గురిచేశాడని సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఆర్థిక లావాదేవీల చిక్కుముడి
ఈ వివాదంలో డబ్బు, బంగారం ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు కనిపిస్తోంది. తన వద్ద ఉన్న రూ. 2 లక్షల నగదును, నగలను రాహుల్ ఇప్పటికే ఖర్చు చేసేశాడని అనిత ఆరోపిస్తోంది. ఇప్పుడు తన వద్ద ఏమీ మిగలకపోవడంతో, తనను వదిలించుకోవడానికి, సమాజంలో బద్నాం చేయడానికి రాహుల్ లేనిపోని కథలు అల్లుతున్నాడని ఆమె వాదిస్తోంది. "నేనే తప్పు చేసి ఉంటే, నేరుగా పోలీస్ స్టేషన్‌కు ఎందుకు వస్తాను?" అని ఆమె పోలీసులను ప్రశ్నించింది.
ప్రస్తుత పరిస్థితి
ప్రస్తుతం ఈ కేసులో పోలీసులు ఇరుపక్షాల వాదనలను నమోదు చేసుకున్నారు. అత్తా-అల్లుళ్లు ఇద్దరూ మేజర్లు కావడంతో గతంలో వారు స్వచ్ఛందంగానే వెళ్లినట్లు రికార్డులు ఉన్నాయి. అయితే ఇప్పుడు వచ్చిన కిడ్నాప్, బందీ, దొంగతనం ఆరోపణలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనతో సంబంధం ఉన్న యువతి (అనిత కూతురు),ఇతర కుటుంబ సభ్యులు అవమానంతో తలదించుకుని, ఈ విషయంపై మాట్లాడటానికి నిరాకరిస్తున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications