Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విమానాశ్రయాల పునరుద్ధరణ..యధాతథ స్థితికి విమానాల రాకపోకలు: ఎందుకంటే..?

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ సహా పాకిస్తాన్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయలను మూసివేస్తూ ఆదేశాలు వెలువడిన కొన్ని గంటల వ్యవధిలోనే కేంద్రప్రభుత్వం.. వాటిని ఉపసంహరించుకుంది. ఆ ఆదేశాలను వెనక్కి తీసుకుంది. విమానాశ్రయాలను పునరుద్ధరించాలని ఆదేశించింది. పౌర విమానాల రాకపోకలను యధాతథ స్థితికి తీసుకుని రావాలని సూచించింది. ఈ ఆదేశాలు వెలువడిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే జమ్మూ విమానాశ్రయం తెరచుకుంది. విమానాల రాకపోకలు మొదలయ్యాయి కూడా.

భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో నెలకొన్న యుద్ధ వాతావరణనాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రప్రభుత్వం అత్యంత కీలకమైన ఎనిమిది విమానాశ్రయాలను మూసివేస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలు వెలువడిన వెంటనే చండీగఢ్, జమ్మూ, శ్రీనగర్, లేహ్ సహా పంజాబ్ లోని అమృత్ సర్, పఠాన్ కోట్, హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి, కంగ్రా, సిమ్లా విమానాశ్రయాలను మూసివేశారు. అంతేకాకుండా- ఐరోపా, గల్ఫ్ దేశాలకు వెళ్లడానికి పాకిస్తాన్ గగనతలాన్ని వినియోగించుకోకూడదని కూడా ఆదేశాలు వెలువడ్డాయి.

all 8 airports to open again for commercial flights soon as shutdown order withdrawn

ఈ ఆదేశాలు వెలువడిన కొన్ని గంటల వ్యవధిలోనే కేంద్రం.. వాటిని వెనక్కి తీసుకుంది. విమానాశ్రయాలను పునరుద్ధరించాలని ఆదేశించింది. దీనితో జమ్మూ సహా కొన్ని విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలు ఆరంభమైనట్లు తెలుస్తోంది. యుద్ధ వాతావరణం నేపథ్యంలో దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకూడదనే ఉద్దేశంతోనే కేంద్రం ఈ విమానాల రాకపోకలను పునరుద్ధరించినట్లు చెబుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+