మోత మోగిస్తోన్న టాటా మోటార్స్ షేర్లు
టాటా మోటార్స్ కంపెనీ షేర్లు మోత మోగిస్తున్నాయి. ఆరు సంవత్సరాల గరిష్టానికి కంపెనీ షేర్లు చేరుకోవడంపై పెట్టుబడిదారులు ఆనందంగా ఉన్నారు. గుజరాత్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందమే షేర్ల పెరుగుదలకు కారణమని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ఎలక్ట్రిక్ కార్ల విక్రయాల్లో టాటా మోటార్స్ ముందంజలో ఉంది. తన సొంత అవసరాల కోసం లిథియం-అయాన్ బ్యాటరీల కంపెనీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు రూ.13వేల కోట్లు పెట్టుబడిగా పెట్టేందుకు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందమే కంపెనీ షేరును పరుగులెత్తిస్తోంది.
లిథియం-అయాన్ బ్యాటరీల తయారీ ప్లాంట్ టాటా మోటార్స్ కు ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండు విధాలుగా ఉపయోగపడనుండటంతో ఈ కంపెనీ షేర్లు కొనేందుకు పెట్టుబడిదారులు ఎగబడుతున్నారు. గతేడాది డిసెంబరు 26వ తేదీన ఈ షేర్లు రూ.375.5ను చేరుకుంది. తాజా పెరుగుదలవల్ల మార్కెట్ విలువ రూ.2 లక్షల కోట్లకు చేరుకుంది. ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో 52 వారాల గరిష్టమైన 548.30 దగ్గర ట్రేడవుతోంది. 1945లో జేఆర్డీ టాటా దేశ రవాణా అవసరాలను తీర్చేందుకు ఈ కంపెనీని ఏర్పాటు చేశారు.

షేరు మార్కెట్ లో తాజాగా టొరెంట్ పవర్ లిమిటెడ్ స్టాక్ పెట్టుబడిదారులకు మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చింది. సంవత్సర కాలంలో 43 శాతానికి పైగా రిటర్న్స్ అందించింది. గడిచిన మూడు సంవత్సరాల కాలంతో పోలిస్తే 99 శాతానికి పైగా లాభాలు అందజేసింది. మూడు సంవత్సరాల క్రితం ఈ స్టాక్ లో రూ.లక్ష పెట్టుబడి పెడితే మరో లక్ష లాభం వస్తుంది. ఐదు సంవత్సరాల కాలంలో ఈ కంపెనీ విక్రయాలు 17 శాతం మేర పెరిగాయి.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications