బుల్లితెర 'ఆనంది'కి ఆర్థిక ఇబ్బందులా?: 'ప్రియుడికి అమ్మాయిలతో సంబంధం'

ముంబై: తమ కూతురును రాహుల్‌ రాజ్ సింగ్ చిత్రహింసలు పెట్టేవారని నటి ప్రత్యూష తల్లిదండ్రులు ఆరోపించారు. ఆయనకు చాలామంది అమ్మాయిలతో సంబంధాలున్నాయని చెబుతున్నారు. 'చిన్నారి పెళ్లి కూతురు' ఫేమ్ (హిందీలో బాలికా వధు) ప్రత్యూష (ఆనంది) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

ఆమె అంత్యక్రియలు ముంబైలోని ఉషివారా శ్మశానంలో శనివారం జరిగాయి. వీటికి పలువురు బుల్లితెర నటులు హాజరయ్యారు. ఈ సమయంలో ప్రత్యూష స్నేహితులు సైతం రాహుల్‌ పైన ఆరోపణలు చేశారు. ప్రత్యూష ముక్కు, కళ్ల కింద గాయాలున్నాయని, దానికి సంబంధించిన ఫోటోలు కూడా తమ దగ్గరున్నాయని, తన వ్యక్తిగత జీవితంలో సమస్యలున్నాయని స్నేహితులుగా తమకు తెలుసునని కామ్య పంజాబీ తెలిపారు.

ఆర్థిక ఇబ్బందులు కారణమా?

ప్రత్యూష ఆత్మహత్య నేపథ్యంలో ముంబై పోలీసులు ఆమె ప్రియుడు రాహుల్‌ రాజ్‌సింగ్‌ను పద్నాలుగు గంటల పాటు విచారించారు. అయితే ప్రత్యూష ఆత్మహత్య చేసుకోవడానికి రాహుల్‌కి ఎలాంటి సంబంధం లేదని, తనకి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నట్లు తెలిసిందని పోలీసులు వెల్లడించారు.

మరో పక్క ప్రత్యూష తల్లిదండ్రులు తమ కుమార్తె ఆత్మహత్య విషయంలో రాహుల్‌ ప్రమేయం లేదని తాజాగా చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరో పక్క ప్రత్యూష ముక్కు, కళ్ల కింద గాయాలున్నాయని స్నేహితులు అంటున్నారు. ప్రత్యూషకి ఆర్థిక ఇబ్బందులు లేవని పోలీసులకు తమ వివరణ ఇవ్వనున్నామని చెప్పారు.

ప్రత్యూష ఆత్మహత్య

ప్రత్యూష ఆత్మహత్య

చిన్నారి పెళ్లి కూతురు ధారావాహిక నటి ప్రత్యూష బెనర్జీకి, తనకు ఇటీవల కాలంలో ఎలాంటి గొడవలూ జరగలేదని ఆమె ప్రియుడు రాహుల్‌ రాజ్‌ సింగ్‌ చెబుతున్నారు.

 ప్రత్యూష ఆత్మహత్య

ప్రత్యూష ఆత్మహత్య

త్వరలో తామిద్దరం పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఆనందీగా బుల్లితెర ప్రేక్షకుల మన్ననలు పొందిన ప్రత్యూష.. ముంబైలోని తన నివాసంలో శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది.

 ప్రత్యూష ఆత్మహత్య

ప్రత్యూష ఆత్మహత్య

ఈ విషయాన్ని మొదట గుర్తించింది రాహులే రాజ్ సింగే కావడం గమనార్హం.. దీంతో ఆయన్ను శనివారం పోలీసులు ప్రశ్నించారు. కానీ అరెస్టు చేయలేదు.

 ప్రత్యూష ఆత్మహత్య

ప్రత్యూష ఆత్మహత్య

మరోవైపు, ప్రత్యూష బెనర్జీ ఊపిరాడకే చనిపోయిందని పోస్టుమార్టం రిపోర్టులో తేలిందని తెలుస్తోంది. గొంతు బిగుసుకుపోయిన ఆనవాళ్లున్నాయని తేలింది.

ప్రత్యూష ఆత్మహత్య

ప్రత్యూష ఆత్మహత్య

ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య విషయంలో అందరి వేళ్లూ ఆమె ప్రియుడు రాహుల్ వైపు చూస్తుండటంతో.. పోలీసులు ఆ దిశలో కూడా దర్యాఫ్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+