కాంగ్రెస్‌కు షాక్:అగస్టావెస్ట్‌లాండ్ కేసులో అప్రూవర్‌గా రాజీవ్ సక్సేనా
ఢిల్లీ: యూపీఏ ప్రభుత్వాన్ని కుదిపేసిన అగస్టావెస్ట్‌ల్యాండ్ వీవీఐపీ హెలికాఫ్టర్ కుంభకోణంలో మధ్యవర్తిగా వ్యవహరించిన దుబాయ్ పారిశ్రామికవేత్త రాజీవ్ సక్సేనా తాను అప్రూవర్‌గా మారేందుకు పెట్టుకున్న పిటిషన్‌పై ఢిల్లీకోర్టు అంగీకారం తెలిపింది. రాజీవ్ సక్సేనా పై వచ్చిన ఆరోపణలకు రుజువుగా కొన్ని డాక్యుమెంట్లు జతచేసి కోర్టు ముందు ఈడీ ఉంచింది. ఈ పిటిషన్‌ను విచారణ చేసిన స్పెషల్ జడ్జి అరవింద్ కుమార్ రాజీవ్ సక్సేనా అప్రూవర్‌గా మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుపుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను అంగీకరించారు.
ఇక అగస్టా వెస్ట్‌ల్యాండ్ కేసులో రాజీవ్ సక్సేనా ఇచ్చిన స్టేట్‌మెంట్ చాలా కీలకంగా మారనుందని ఈడీ న్యాయస్థానంకు తెలిపింది. అంతేకాదు ఈ కేసులో ఆయన చాలా కీలక సాక్షి అని ఈడీ కోర్టుకు తెలిపింది. ఈఏడాది జనవరి 30న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భద్రతాధికారులు రాజీవ్ సక్సేనాను దుబాయ్‌లోని తన నివాసం నుంచి అరెస్టు చేశారు. అదే రోజు రాత్రి ఆయన్ను భారత్‌కు తరలించారు. అయితే గతవారమే తన ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. అయితే తన బెయిల్ దరఖాస్తును ఈడీ వ్యతిరేకించలేదు.

రాజీవ్ సక్సేనా మరో న్యాయవాది గౌతం ఖైతాన్‌తో కలిసి పలువురు రాజకీయ నాయకులకు, బ్యూరోక్రాట్లకు, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారులకు మనీలాండరింగ్ పద్ధతిలో డబ్బలు ముట్టజెప్పినట్లు ఈడీ చెబుతోంది. 12 వీవీఐపీ హెలికాఫ్టర్లు కొనుగోలు చేసేందుకు గాను ఆ కాంట్రాక్ట్ అగస్టా వెస్ట్‌లాండ్‌కు దక్కేలా వీరు పావులు కదిపారని ఈడీ పేర్కొంది. రోమ్‌లో ఈ హెలీకాఫ్టర్ల డిజైన్, ఉత్పత్తి జరుగుతుంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications