రేప్ చేసి బావిలో తోసేశాడు, 15 గంటలు సజీవంగా

పొలంలో పనిచేయడానికి వెళ్లినప్పుడు అమ్మాయిపై భిల్వారా పట్టణంలో ఇంటి పొరుగున ఉండే వ్యక్తి దాడి చేసినట్లు సమాచారం. ఆ తర్వాత ఆమెను తీసుకుని వెళ్లి బావిలోకి తోసేశాడు. చంపాలనే ఉద్దేశంతో అతను ఆ పనిచేశాడు.
మర్నాడు ఉదయం సహాయం కోసం అరుస్తున్న ఆమెను కొంత మంది చూసి రక్షించారు. ఆమెపై దాడి చేసిన వ్యక్తి పరారీలో ఉన్నాడు. అత్యాచారం, హత్యాప్రయత్నం కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
రాత్రంతా తాను నీళ్లలో ఉన్నానని, మర్నాడు ప్రజలు తనను రక్షించడంతో బయటపడ్డానని బాధితారులు చెప్పింది. భారీ వర్షం పడుతుండడంతో రాత్రిపూట ఆమె అరుపులు ఎవరికీ వినిపించలేదు. బావిలో అమర్చిన మోటారును ఆసరా చేసుకుని ఆమె బావిలో ప్రాణాలను రక్షించుకుంది.












Click it and Unblock the Notifications