యువతిపై రేప్: వైస్ చాన్స్ లర్ అరెస్టు
బెంగళూరు: యువతి మీద అత్యాచారం చేస్తున్నాడని ఆరోపిస్తూ బెంగళూరు నగరంలోని మడివాళ పోలీసులు వైస్ చాన్స్ లర్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. విశ్వవిధ్యాలయంలో ఉద్యోగం చేస్తున్న యువతిని బెదిరించి గత రెండు సంవత్సరాల నుంచి అత్యాచారం చేస్తున్నాడని పోలీసులు అన్నారు.
అనేకల్ సమీపంలోని అలాయన్స్ విశ్వవిధ్యాలయంలో మధుకర్ జి. అంగూర్ వైస్ చాన్స్ లర్ గా పని చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తరువాత మధుకర్ ను అరెస్టు చేశామని శనివారం మడివాళ పోలీసులు అన్నారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు తాము కేసు నమోదు చేశామని మడివాళ పోలీసులు తెలిపారు. మధుకర్ పని చేస్తున్న విశ్వవిధ్యాలయంలో అతని దూరపు బంధువు 32 ఏళ్ల యువతి ఉద్యోగం చేస్తున్నది. గత రెండు సంవత్సరాల నుంచి ఆమె మీద మధుకర్ అత్యాచారం చేస్తున్నాడు.

విషయం బయటకు చెబితే చంపేస్తానని, ఉద్యోగం నుంచి తీసివేస్తానని బెదిరించాడు. ఈ విషయంలో ఆమె మానసికంగా కుంగిపోయింది. చివరికి ఇటీవల కుటుంబ సభ్యులకు ఆమె విషయం చెప్పింది, యువతికి వైద్య పరిక్షలు నిర్వహించారు.
మధుకర్ కు వైద్య పరిక్షలు నిర్వహించామని, నివేదిక అందవలసి ఉందని పోలీసులు అన్నారు. 2010లో ఈ అలాయన్స్ విద్యాసంస్థలకు కర్ణాటకలో విశ్వవిధ్యాలయం గుర్తింపు వచ్చింది. మధుకర్ ను విచారణ చేస్తున్నామని పోలీస అధికారులు తెలిపారు.
-
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం..












Click it and Unblock the Notifications