అమర్ సింగ్ ఆస్తుల విలువ అక్షరాలా రూ. 100 కోట్లు

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ బహిష్కృత నేత, రాష్ట్రీయ లోక్‌దళ్ ఫతేర్‌పుర్ సిక్రీ అభ్యర్థి అమర్ సింగ్ ఆస్తి అక్షరాలా వంద కోట్ల రూపాయలు. ఆయన ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఆయన ఫతేపూర్ సిక్రీ స్థానం బరిలోకి దిగుతున్న విషయం తెల్సిందే.

ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో తనకు, తన భార్యకు కలిపి వంద కోట్ల ఆస్తి ఉందని ప్రకటించారు. బ్యాంకు డిపాజిట్లు, షేర్లలో పెట్టుబడి, మ్యూచువల్ ఫండ్లు, బీమా పాలసీలు కలిపి రూ.41.34 కోట్ల చరాస్తులు ఉన్నాయని ఆయన తెలిపారు.

Amar Singh, wife assets worth about Rs 100 crore

ఓ భాగస్వామ్య సంస్థలో రూ.12.23 కోట్ల పెట్టుబడి, లెక్సస్; మారుతి స్విఫ్ట్ కార్లు, రూ.8.68 లక్షల విలువైన బంగారం, 28 కిలోల వెండి పాత్రలు ఉన్నట్టు పేర్కొన్నారు. ఇంకా ఫర్నీచర్, వాచీలు, పెయింటింగులు.. వీటన్నింటి విలువ మరో రూ.64.40 లక్షలు ఉంటాయని తెలిపారు.

ఆయన భార్యకు రూ.21.95 కోట్ల చరాస్తులున్నాయి. తనకు చేతిలో రూ.పది లక్షల నగదు, తన భార్యకు రూ.ఐదు లక్షల నగదు ఉన్నట్లు అమర్ సింగ్ తెలిపారు. అలాగే, నోయిడా, లక్నో, బెంగళూరు ప్రాంతాల్లో ఇళ్లు, భూములు ఉన్నట్టు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+