బలపరీక్ష జరపాల్సిందే: అమరీందర్ సింగ్ వర్గం డిమాండ్.. మింగుడుపడని విషయమే..?
పంజాబ్ పీసీసీ చీఫ్ పదవీకి సిద్దు రాజీనామాతో కలకలం నెలకొంది. ఆయనకు మద్దతుగా మంత్రి, ఎమ్మెల్యేలు.. రాజీనామా చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం సిద్దూ రాజీనామాను ఆమోదించలేమని తేల్చిచెప్పింది. ఆప్ నేత ఒకరు కూడా 72 గంటల్లో సిద్దూ.. కాంగ్రెస్ గూటికి చేరుకుంటారని కామెంట్ చేశారు. ఈ క్రమంలో మాజీ సీఎం అమరీందర్ సింగ్ వర్గం కొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకొని వచ్చింది. అదీ నిజమే అయితే.. కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడని విషయంగా మారనుంది.
రాజీనామాలతో రాష్ట్ర ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం ఎదుర్కొవాలని అమరీందర్ సింగ్ సన్నిహితులు అంటున్నారు. ఇదీ కాస్త ఇబ్బందికరమే.. ఎందుకంటే సొంత పార్టీ బలపరీక్ష జరపాలని కోరడం మింగుడు పడని విషయమే. మరీ దీనిని కాంగ్రెస్ హై కమాండ్ ఏ విధంగా లీడ్ చేస్తుందో చూడాలీ. సిద్దు రాజీనామా చేసిన వెంటనే కొందరు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. రజియా సుల్తానా మంత్రి పదవీకి, ముగ్గురు కాంగ్రెస్ నేతలు పదవులకు రాజీనామా చేశారు. యోగిందర్ ధింగ్రా జనరల్ సెక్రటరీ పదవీకి, గుల్జార్ ఇందర్ చాహల్ ట్రెజరర్, గౌతమ్ సేత్ జనరల్ సెక్రటరీ పదవీ నుంచి వైదొలుగుతున్నామని తెలిపారు. సిద్దు తన పదవీకి రాజీనామా చేశారు.. కానీ పార్టీలో కొనసాగుతానని స్పష్టంచేసిన సంగతి తెలిసిందే.
సోనియాకు రాసిన లేఖలో సిద్దూ.. పంజాబ్ భవిష్యత్ తనకు ముఖ్యం అని స్పష్టంచేశారు. రాష్ట్రాభివృద్దే ఇంపార్టెంట్ అని తెలిపారు. మరోవైపు అమరీందర్ సింగ్ బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు కూడా వినిపించాయి. ఢిల్లీ వెళ్లిన ఆయన.. సిద్దు రాజీనామాతో.. తాను ఎవరితో మీట్ కావడం లేదని స్పస్టంచేశారు.

వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నాయి. ఈ క్రమంలో అమరీందర్/ సిద్దూను చక్కదిద్దేందుకు హై కమాండ్ విశ్వప్రయత్నాలు చేసింది. కానీ మంగళవారం మంత్రివర్గం కొలువుదీరింది. రాణా మంత్రి పదవీ చేపట్టడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. అమరీందర్ పార్టీ వీడతారనే ప్రచారం కొనసాగింది. దానిని ఎలా పూడ్చాలని భావించాలనే సమయంలోనే.. సిద్దు రాజీనామా చేశారు. దీనిపై అమరీందర్ కూడా స్పందించారు. సిద్దుకు స్థిరత్వం లేదని ట్వీట్ చేశారు. అతనికి అంతలా ప్రాధాన్యం ఇవ్వడంతో ఇలా చేస్తున్నారని కామెంట్ చేశారు. మొత్తానికి పంజాబ్ కాంగ్రెస్ పరిణామాలు చాకచాకగా మారిపోతున్నాయి. దీనిని గాంధీ కుటుంబం ఎలా లీడ్ చేస్తుందో చూడాలీ.. కానీ అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం తప్పకుండా పడుతుందుని విశ్లేషకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications