అమిత్ షాతో అమరీందర్ సింగ్ భేటీ.. బీజేపీలో చేరతారా..?
పంజాబ్ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఢిల్లీ వచ్చిన అమరీందర్ సింగ్.. ఇవాళ సాయంత్రం హోం మంత్రి అమిత్ షా ఇంటికి చేరుకున్నారు. నిన్న హస్తిన వచ్చిన ఆయన.. తన పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం లేదని స్పష్టంచేశారు. కానీ ఆయన మాత్రం షాతో భేటీ కావడం చర్చకు దారితీసింది. అమిత్ షా అధికార నివాసానికి చేరుకున్న.. కెప్టెన్ వివిధ అంశాలపై డిస్కష్ చేస్తున్నారు. బీజేపీలో చేరికపై డిస్కష్ చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. కానీ దీనికి సంబంధించి అధికార ప్రకటన రావాల్సి ఉంది. అమరీందర్ బీజేపీలో చేరతారా.. లేదంటే మద్దతు తెలుపుతారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
మరోవైపు ఇంకా దారులు మూసుకుపోలేదని అమరీందర్ సింగ్ సన్నిహితులు అంటున్నారు. చర్చలకు అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు. కానీ ఈ సమయంలో గాంధీ కుటుంబం.. అమరీందర్‌తో చర్చలు జరుపుతారా అనే అంశంపై స్పష్టత లేదు. మరోవైపు ఏఐసీసీ పరిశీలకులు హరీశ్ చౌదరీ చండీఘడ్ చేరుకున్నారు. పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. సిద్దూ పీసీసీ చీఫ్ పదవీకి రాజీనామా చేయడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

మరోవైపు రాజీనామాలతో రాష్ట్ర ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం ఎదుర్కొవాలని అమరీందర్ సింగ్ సన్నిహితులు నిన్న ప్రకటన చేశారు. ఇదీ కాస్త ఇబ్బందికరమే.. ఎందుకంటే సొంత పార్టీ బలపరీక్ష జరపాలని కోరడం మింగుడు పడని విషయమే. సిద్దూ రాజీనామా చేసిన వెంటనే కొందరు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. రజియా సుల్తానా మంత్రి పదవీకి, ముగ్గురు కాంగ్రెస్ నేతలు పదవులకు రాజీనామా చేశారు. యోగిందర్ ధింగ్రా జనరల్ సెక్రటరీ పదవీకి, గుల్జార్ ఇందర్ చాహల్ ట్రెజరర్, గౌతమ్ సేత్ జనరల్ సెక్రటరీ పదవీ నుంచి వైదొలుగుతున్నామని తెలిపారు. సిద్దు తన పదవీకి రాజీనామా చేశారు.. కానీ పార్టీలో కొనసాగుతానని స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. సోనియాకు రాసిన లేఖలో సిద్దూ.. పంజాబ్ భవిష్యత్ తనకు ముఖ్యం అని స్పష్టంచేశారు. రాష్ట్రాభివృద్దే ఇంపార్టెంట్ అని తెలిపారు.
వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నాయి. ఈ క్రమంలో అమరీందర్/ సిద్దూను చక్కదిద్దేందుకు హై కమాండ్ విశ్వప్రయత్నాలు చేసింది. కానీ మంగళవారం మంత్రివర్గం కొలువుదీరింది. రాణా మంత్రి పదవీ చేపట్టడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. సిద్దుకు స్థిరత్వం లేదని అమరీందర్ సింగ్ ట్వీట్ చేశారు. అతనికి అంతలా ప్రాధాన్యం ఇవ్వడంతో ఇలా చేస్తున్నారని కామెంట్ చేశారు. మొత్తానికి పంజాబ్ కాంగ్రెస్ పరిణామాలు చాకచాకగా మారిపోతున్నాయి.












Click it and Unblock the Notifications