అమర్నాథ్ యాత్రలో విషాదం: బస్సు లోయలో పడి 16 మంది మృతి

Posted By:
Subscribe to Oneindia Telugu

శ్రీనగర్: అమర్నాథ్ యాత్రలో విషాధం చోటు చేసుకుంది. భక్తులతో వెళ్తున్న ఓ బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 16 మంది మృతి చెందగా, ముప్పై మందికి పైగా గాయాలయ్యాయి.

జమ్ము జాతీయ రహదారిలో ఉన్న రంబన్ ప్రాంతంలోని నాచ్ నల్లా వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. బస్సు జమ్ము నుంచి పహెల్గాం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Amarnath Yatra bus falls into gorge on Jammu-Srinagar highway, 10 killed

కాగా,అమర్నాథ్ యాత్ర లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి పాల్పడిన ఘటనలో మరొకరు మృతి చెందారు. 47 ఏళ్ల మహిళా యాత్రికురాలు లలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందారు. దీంతో ఈ ఘటనలో ఇప్పటివరకూ మృతి చెందిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది.

జులై 10న అనంత్‌నాగ్‌ జిల్లాలోని బటంగూ వద్ద యాత్రికులు వెళ్తున్న బస్సుపై ఉగ్రవాదులు అమానుషంగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందడంతో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ten Amarnath yatris were killed and several injured when a bus carrying them fell into a gorge in Jammu. At least 35 were injured in the accident.The bus met with an accident at Nach Nalla in Ramban area of Jammu, on the national highway. The bus had gone deep into the gorge while going from Jammu to Pahalgam.
Please Wait while comments are loading...