సమాజ్ వాదీ పార్టీలో ముసలంపై నోరు విప్పిన అమర్ సింగ్

లక్నో: సమాజ్ వాదీ పార్టీలో సంక్షోభంపై ఆ పార్టీ సీనియర్ నాయకుడు అమర్ సింగ్ నోరు విప్పారు. తన కారణంగానే సమాజ్ వాదీ పార్టీలో సంక్షోభం నెలకొందనే ప్రచారాన్ని ఆయన తప్పుబట్టారు.అఖిలేష్ యాదవ్ తీరును అమర్ సింగ్ తప్పుబట్టారు.

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కూడ తాను నేరుగా కలువగలుగుతానని, అఖిలేష్ ను మాత్రం కలువలేకపోతున్నాని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.తనను అఖిలేష్ బ్రోకర్ అనడం పట్ల ఆయన తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు.తనను బ్రోకర్ అని అఖిలేష్ యాదవ్ ఆరోపించడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు.

amarsingh tell about akhilesh

తన కారణంగానే పార్టీలో సమస్యలనీ చెప్పడం సరైంది కాదన్నారు.తనను బలి చేస్తే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని అనుకొంటే తాను బలికి సిద్దమని ఆయన చెప్పారు.తాను అనని మాటలను అన్నట్టుగా చెప్పడం భావ్యం కాదన్నారాయన. రాంగోపాల్ యాదవ్ ను నపుంసకుడని, ములాయం ను షాజహాన్ అని,అఖిలేష్ ను ఔరంగజేబు అనలేదని ఆయన వివరణ ఇచ్చారు.

తనను చంపుతాననంటూ రాంగోపాల్ యాదవ్ బెదిరించారని ఆయన మీడియాకు తెలిపారు. ములాయం కుటుంబసభ్యులంతా వ్యతిరేకించినా అఖిలేష్ వివాహాన్ని తానే దగ్గరుండి జరిపించానని ఆయన గుర్తు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+