అయోధ్యలో రామాలయంతో పాటు చూడాల్సిన అద్భుతమైన ప్రదేశాలివే!!
ఈ నెల 22న అత్యంత ప్రతిష్టాత్మకంగా అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది, ఈ అపురూపమైన వేడుకకు అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుంది. 500 సంవత్సరాల తర్వాత రాముడు తన నివాసమైన అయోధ్యకుతిరిగి వస్తున్న వేడుకను చూసేందుకు దేశ వ్యాప్తంగా ప్రజలు సిద్ధమవుతున్నారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి వెళ్లేందుకు ఇప్పటి నుండే ప్రజలు సిద్ధమవుతున్నారు.
అయితే అయోధ్య వెళ్ళే వారు రామ మందిరంతో పాటు అక్కడ ఏమేమి చూడొచ్చు. అక్కడ చూడవలసిన అద్భుత ప్రదేశాలేమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయోధ్య వెళ్ళేవారు రామాలయ ప్రారంభోత్సవం నాడు అక్కడి వేడుక, ఆలయ వైభవాన్ని తప్పక చూడాల్సిందే. ఇక అయోధ్య రామయ్య మందిరం మాత్రమే కాకుండా అయోధ్యలోని కామి గంజ్ ప్రాంతంలో ఉన్న మణి పర్వత్ ను తప్పకుండా సందర్శిచాలి.

ఈ పర్వతం హిందూ మతంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న పర్వతం, హనుమాన్ సంజీవని పర్వతాన్ని తీసుకు వెళ్తున్న సమయంలో కొంతభాగం ఇక్కడ పడిందని చెప్తారు.ఇక ఇక్కడే బౌద్ద విహారం, స్థూపం కూడా ఉన్నాయి. ఇవి ప్రతీ ఒక్కరూ తప్పక చూడవలసినవి. అయోధ్య వెళ్ళేవారు సీతా కి రసోయి పేరు సూచించినట్లుగా రామాయణ యుగంలో సీతా దేవి యొక్క వంటగదిగా ఉండేది.
అది ఇప్పుడు దేవాలయంగా రూపాంతరం చెందింది. అప్పట్లో పాత్రలు, వంట సామాన్లను చూడటానికి మీరు ఈ స్థలాన్ని సందర్శించవచ్చని అంటున్నారు. అయోధ్యలో రామ్ కథా పార్కు ఒక అద్భుతమైన ప్రదేశం. ఇక్కడ రామ మందిరానికి సంబంధించి సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రార్ధనా సమావేశాలు, అనేక ఇతర కార్యక్రమాలు ఉంటాయి. ఈ ప్రదేశం కూడా చూడదగినది.

అయోధ్య ఘాట్ లో బోట్ రైడ్ కూడా ఆకట్టుకుంటుంది. అయోధ్యలో సాయంత్రాలు మరియు ఉదయాలు స్వర్గాన్ని తలపిస్తుంది. సరయు నది ఒడ్డున బోట్ ప్రయాణంలో మునిగిపోవచ్చు. అయోధ్యలోని రాజ మందిరం కూడా చూడదగిన ప్రదేశం. రామాయణ కాలం నాటి పౌరాణిక కథలతో ముడిపడి ఉన్న ప్రసిద్ధ దేవాలయం. మీరు ఆలయం లోపల అనేక హిందూ దేవుళ్ళు మరియు దేవతల విగ్రహాలను చూడవచ్చు. అంతేకాకుండా, మీరు ఇక్కడ అద్భుతమైన హిందూ వాస్తుశిల్పాన్ని కూడా చూడవచ్చు.












Click it and Unblock the Notifications