అమెజాన్ ఫుల్‌ఫిల్మెంట్: నవ్వుతూ ఫోటోదిగిన కేటీఆర్
మహబూబ్ నగర్/హైదరాబాద్: పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం అనువైన ప్రదేశమని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బుధవారం అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు మండలం పెంజర్లలో అమేజాన్ ఫుల్‌ఫిల్మెంట్ సెంటర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అమేజాన్ తెలంగాణలో ఫుల్‌ఫిల్మెంట్ సెంటరును ప్రారంభించడం శుభపరిణామమని చెప్పారు. దీనివల్ల 500 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని తాము కోరుతున్నామన్నారు.
అమేజాన్ వారు తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలన్నారు. అమేజాన్ క్లౌడ్ సెంటర్ కూడా హైదరాబాదులో పెట్టుబడులు పెట్టాలని కోరినట్లు చెప్పారు. ఈ నెల 12వ తేదీన రెండువేల మంది పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం కేసీఆర్ భేటీ అవుతారని చెప్పారు.

స్కిల్డ్ వర్క్ ఫోర్స్ మన దేశంలో ఉందన్నారు. నైపుణ్యాన్ని పెంపొందించేందుకు యువతకు ప్రభుత్వం శిక్షణ ఇస్తుందన్నారు. అవినీతి అంటు లేకుండా పరిశ్రమలకు అనుమతి ఉంటుందని, అమేజాన్‌కు పదిరోజుల్లో అనుమతి ఇచ్చామన్నారు.
తెలంగాణ, హైదరాబాదును పారిశ్రామిక హబ్‌గా మారుస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. ఆయన రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ హార్డ్ వేర్ పార్కులో వైండ్ స్లిమ్ టెక్నాలజీ హైబ్రిడ్ సోలార్‌ను ప్రారంభించారు. పరిశ్రమల ఏర్పాటుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారన్నారు.
IT Minister KTR in a group photo with employees @Amazon Fulfilment Centre, Kottur, Mahabubnagar dist. pic.twitter.com/chxwTsUHmm
— Min IT, Telangana (@MinIT_Telangana) June 10, 2015 











Click it and Unblock the Notifications