Amazon offers:దసరా దీపావళికి అమెజాన్ సంబురాలు: భారీ డిస్కౌంట్లు..ఇక పండగ చేస్కోండి..!
హైదరాబాద్ : దసరా వచ్చేస్తోంది.. ఆపై దీపావళి రానుంది. ఈ క్రమంలోనే ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2020 పేరుతో భారీ ఆఫర్లను తమ కస్టమర్లకు అందిస్తోంది. అక్టోబర్ 17 నుంచి ప్రారంభం కానున్న ఈ భారీ సేల్ నెలరోజుల పాటు కొనసాగుతుంది. ఇందులో కొన్ని వందల ఆఫర్లు, డిస్కౌంట్లను అమెజాన్ ప్రకటించింది. అమెజాన్ చరిత్రలోనే నెలరోజుల పాటు భారీ డిస్కౌంట్లను ప్రకటించడం ఇదే తొలిసారి. ఈ సేల్ ముఖ్యంగా దీపావళిని దృష్టిలో పెట్టుకుని ప్రకటించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే పోటీదారులుగా నిలిచిన ఇతర ఈ-కామర్స్ వెబ్‌సైట్లకు ధీటుగా 900 కొత్త ప్రాడక్ట్స్‌ను అమెజాన్ పరిచయం చేస్తోంది. అయితే పోటీలో ఉన్న ఇతర ఈ-కామర్స్ సంస్థలు చాలా తక్కువ సమయం వరకే ఆఫర్లను ప్రకటించాయి. ఇక అమెజాన్‌లో చాలామంది ఎక్కువగా ఇష్టపడే మొబైల్ ఫోన్లు యాక్ససెరీస్‌లు డెడ్ చీప్‌గా వస్తున్నాయి. వీటిపై భారీ ఆఫర్లు మరియు డిస్కౌంట్లతో పాటు నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్స్ ప్రకటించింది. ఇక ఒకవేళ కొనుగోలు చేసిన వస్తువు డ్యామేజ్ అయితే టోటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్‌ను అదనంగా ప్రకటించింది అమెజాన్. ఇక ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులపై కూడా అమెజాన్ భారీ ఆఫర్లను ప్రకటించింది. ఎలక్ట్రానిక్స్ మరియు యాక్సెసరీస్‌పై 70శాతం డిస్కౌంట్లు ప్రకటించింది.

ఇక టీవీ మరియు ఇతర ప్రధాన అప్లయన్స్‌లపై వారంటీ పొడగింపు, నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లను అమెజాన్ సంస్థ ప్రకటించింది. చెప్పిన సమయానికి వస్తువులను డెలివర్ చేయడమే కాకుండా ఉచితంగా ఇన్స్‌టలేషన్ సదుపాయాన్ని కూడా అమెజాన్ ప్రకటిస్తోంది. ఇక పాత వస్తువులను కొత్త వస్తువులతో మార్చుకోవాలంటే ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కింద రూ.13500 వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ఒకవేళ బజాజ్ ఫిన్‌సర్వ్ క్రెడిట్ కార్డు మరియు డెబిట్ కార్డులు ఉంటే వీటికి నో - కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుందని అమెజాన్ వెబ్‌పోర్టల్ ద్వారా తెలుస్తోంది.

ఇక అమెజాన్ ఎకో స్మార్ట్ స్పీకర్స్ , ఫైర్ టీవీ స్టిక్స్ మరియు కిండల్స్ పై పెద్ద మార్జిన్‌తో డిస్కౌంట్లను ప్రకటిస్తోంది అమెజాన్. గృహోపకరణాలు మరియు కిచెన్ అప్లయన్స్‌లపై 60శాతం డిస్కౌంట్‌ను ప్రకటించగా.. అదే బట్టలు మరియు యాక్సెసరీస్‌పై 70శాతం డిస్కౌంట్ ప్రకటించింది అమెజాన్. మొత్తానికి అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్ 2020 అక్టోబర్ 17న ప్రారంభం కానుండగా ప్రైమ్ మెంబర్షిప్ ఉన్న కస్టమర్లకు 24 గంటల ముందే ఈ ఆఫర్ ప్రారంభం అవుతుంది.
Recommended Video













Click it and Unblock the Notifications