ఆగష్టు 9నుంచి అమెజాన్ డిస్కౌంట్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్లు
వినియోగదారులను ఆకట్టుకొనేందుకగాను అమెజాన్ మరోసారి డిస్కౌంట్లను ప్రకటించింది. మూడు రోజుల పాటు ఈ ఆఫర్లు ఉంటాయని ఈ కామర్స్ దిగ్గజం ప్రకటించింది.
న్యూఢిల్లీ: వినియోగదారులను ఆకట్టుకొనేందుకగాను అమెజాన్ మరోసారి డిస్కౌంట్లను ప్రకటించింది. మూడు రోజుల పాటు ఈ ఆఫర్లు ఉంటాయని ఈ కామర్స్ దిగ్గజం ప్రకటించింది.
వినియోగదారులను ఆకట్టుకొనేందుకు ఈ కామర్స్ సంస్థలు ఏదో ఒక ఆఫర్‌ను ప్రకటిస్తూనే ఉంటాయి. అయితే తమకు పోటీ సంస్థలు ఇస్తోన్న ఆఫర్లకు ధీటుగా డిస్కౌంట్లను ప్రకటిస్తుంటాయి.
ఏదో ఒక కారణాన్ని చూపుతూ డిస్కౌంట్ సేల్స్‌కు ఈ కామర్స్ సంస్థలు ఆఫర్లకు తెరతీస్తాయి. అయితే కొన్ని సమయాల్లో ఎలాంటి సందర్భం లేకుండా ఆఫర్ల వర్షం కురిపిస్తాయి.
ఈ తరహ ఆఫర్ల కారణంగా వినియోగదారులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. పోటీ కారణంగా వినియోగదారులకు ప్రయోజనం కలిగే అవకాశం కూడ లేకపోలేదు. అయితే మరోవైపు ఈ ఆఫర్ల పుణ్యమాని అవసరం ఉన్నా లేకున్నా వస్తువులను కొనుగోలు చేసే సంస్కృతి కూడ లేకపోలేదు.

ఆగష్టు 9వ, తేది నుండి డిస్కౌంట్ సేల్స్
ఆగష్టు 9వ, తేది నుండి ఆగష్టు 12వ, తేది అర్ధరాత్రి వరకు ఈ సేల్స్‌ను నిర్వహించనున్నట్టు అమెజాన్ ప్రకటించింది. ఈ మూడు రోజుల పాటు నిర్వహించే గ్రేట్ ఇండియన్ సేల్స్‌లో వినియోగదారులకు కొన్ని వస్తువులపై ప్రత్యేక డిస్కౌంట్లను అందించనుంది. బ్లాక్ బస్టర్ డీల్స్‌ను ఆఫర్ చేయనున్నట్టు ఆ కంపెనీ ప్రకటించింది.
Recommended Video


ప్రైమ్ మెంబర్లకు ప్రత్యేక ఆఫర్లు
అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు ప్రత్యేక ఆఫర్లను కూడ అందుబాటులో ఉండనున్నాయని ఆ కంపెనీ ప్రకటించింది. ప్రైమ్ ఓన్లీ డీల్స్ అందుబాటులో ఉంటాయని అమెజాన్ కంపెనీ ప్రకటించింది. ప్రత్యేకంగా 30 నిమిషాల ముందే టాప్ డీల్స్‌ను ప్రైమ్ మెంబర్ల కోసం అమెజాన్ ప్రారంభించనుంది.

శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్
గ్రేట్ ఇండియన్ సేల్‌లో భాగంగా అమెజాన్ పే బ్యాలెన్స్ ఓన్లీ డీల్స్ కూడ అమెజాన్ ఆఫర్ చేయనుంది. ఆగష్టు 4 నుండి ప్రారంభమయ్యే అమెజాన్ పే బ్యాలెన్స్‌లో అదనంగా 15 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను అందించనుంది అమెజాన్. కనీసం రూ.300 తగ్గింపును అందించే అవకాశం ఉందని అమెజాన్ కంపెనీ ప్రకటించింది.అమెజాన్ ఇన్‌లో అప్పీరల్ తదితర వాటిపై ఇన్‌స్టాంట్ 10 నుండి 15 శాతం క్యాష్‌బ్యాక్‌ను అమెజాన్ పే బ్యాలెన్స్, ఓన్లీ డీల్స్‌లో అందించనున్నారు.

మొబైల్స్‌పై ఆఫర్లే ఆఫర్లు
గ్రేట్ ఇండియన్ సేల్స్‌లో భాగంగా ఆపిల్, వన్‌ప్లస్, శాంసంగ్, యూఎస్‌బీ, వ్యూమా, ఆదిదాస్, రాంగ్గర్, టైటాన్, మార్క్స్ అండ్ స్పెన్సర్, అమెరికన్ టూరిస్టర్, బీపీఎల్, మైక్రోమ్యాక్స్, టీసీఎల్, లెనోవో, హెచ్‌పీ, ఐఎఫ్‌బీ, మెకాఫీ వంటి బ్రాండ్లపై బ్లాక్ బస్టర్ డీల్స్‌ను ఆఫర్ చేయనున్నట్టు అమెజాన్ ప్రకటించింది.

ఎస్‌బిఐ క్రెడిట్ కార్డులపై అదనంగా ఆఫర్లు
ఎస్‌బిఐ డెబిట్, క్రెడిట్ కార్డు హోల్డర్లకు అదనంగా యాప్‌లో కొనుగోలు చేస్తే 15 శాతం క్యాషబ్యాక్, వెబ్‌సైట్‌లో కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను అమెజాన్ ఆఫర్ చేసినట్టు తెలిపింది. యాప్‌లో కొనుగోలు చేసే కష్టమర్లకు ఖరీదైన పెయిడ్ ట్రిప్స్ వంటి వాటిలో అద్భుతమైన ట్రావెల్ ఆఫర్లను అందించబోతోంది. అన్ని ఈ మెయిల్ గిఫ్ట్ కార్డులపై 5 శాతం , బుక్‌మై షో క్లియర్‌ట్రిప్, పాంటాలూన్స్, జోయాలుకాస్ నుండి గిఫ్ట్ కార్డులపై 20 శాతం తగ్గింపును అమెజాన్ ప్రకటించింది.












Click it and Unblock the Notifications