గుడ్ న్యూస్: అమెజాన్ లో 22 వేల ఉద్యోగాలు, త్వరలోనే భర్తీ..

భారత్‌లో త్వరలో 22 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజ సంస్థ అమెజాన్‌ ప్రకటించింది. ముంబయి, హైదరాబాద్‌, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్‌ ఇతర నగరాల్లో నియామకాలు జరుగుతాయి.

న్యూఢిల్లీ: భారత్‌లో త్వరలో 22 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజ సంస్థ అమెజాన్‌ ప్రకటించింది. వివిధ పండుగల సందర్భాల్లో దేశంలో తన సేవలను మరింత సమర్థంగా అందించేందుకు వీలుగా ఈ సీజనల్‌ ఉద్యోగ అవకాశాలను కల్పించాలని నిర్ణయించినట్టు సంస్థ తెలిపింది.

ముంబయి, హైదరాబాద్‌, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్‌ సహా పలు నగరాల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్టు అమెజాన్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఫుల్‌ఫిల్‌మెంట్‌, షార్టేషన్‌ సెంటర్లు, డెలివరీ స్టేషన్లు, వినియోగదారుల సర్వీస్‌ సైట్లకు సంబంధించిన వాటిలో ఉపాధి అవకాశాలను కల్పించనున్నట్టు వివరించింది.

amazon

ఈ 22 వేల ఉద్యోగాల నియామకంతో తమ సంస్థ వినియోగదారులకు అందించే సేవల్లో నాణ్యత పెరగడమే కాకుండా, మరింత వృద్ధి చెందుతుందని సంస్థ ఉపాధ్యక్షుడు అఖిల్‌ సక్సేనా అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా వినియోగదారులకు మెరుగైన సేవలను అందిచేందుకు కూడా వీలవుతుందన్నారు.

వీరితో దేశంలోని 41 ఫుల్‌ఫిల్‌మెంట్‌ కేంద్రాలు, 15 షార్టేషన్‌ కేంద్రాలు, సుమారు 150 డెలివరీ స్టేషన్ల ద్వారా వినియోగదారులకు తమ సేవలను మరింత చేరువ చేస్తామన్నారు. 12 నగరాల్లో అమెజాన్‌కు 13 వినియోగదారుల సేవా కేంద్రాలు ఉన్నాయి. వాటి ద్వారా కన్నడ, తెలుగు, హిందీ, తమిళం, ఆంగ్ల భాషల్లో ఈమెయిల్‌, ఛాటింగ్‌, సోషల్‌మీడియా, ఫోన్ల ద్వారా వినియోగదారులకు సేవలందించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+