Amazon Pay: రూ.2000 నోట్లను అమెజాన్ పేలో డిపాజిట్ చేయవచ్చు.. అదీ ఇంటి దగ్గరి నుంచే..
మీ రూ.2000 నోట్లను డిపాజిట్ చేసేందుకు బ్యాంకుకు వెళ్లి విసిగిపోయారా.. అయితే ఏం బాధపడకండి. అమెజాన్ పే మీకు అద్భుతమైన అవకాసం కల్పిస్తోంది. ఈ ఇ-కామర్స్ దిగ్గజం Amazon Pay క్యాష్ లోడ్ ఎంపికను అందిస్తోంది. ఇక్కడ మీరు మీ Amazon Pay బ్యాలెన్స్ ఖాతాలో ఇష్టమున్నాన్ని రూ. 2,000 నోట్లతో సహా నగదును డిపాజిట్ చేయవచ్చు. ఇది మీ ఇంటి వద్ద నుంచి చేయవచ్చని అమెజాన్ పే పేర్కొంది.
మీరు మీ ఖర్చు అవసరాల కోసం నెలకు రూ. 50,000 వరకు నగదును లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. లోడ్ చేసుకున్న డబ్బుతో మీరు ఆన్‌లైన్ కొనుగోళ్లు చేయవచ్చు. స్టోర్‌లలో స్కాన్ చేయడం ద్వారా చెల్లించవచ్చు. బ్యాలెన్స్‌ని ఉపయోగించి Amazonలో షాపింగ్ చేయవచ్చు. మీరు దీన్ని మీ డబ్బులను మీ బ్యాంక్ ఖాతాకు కూడా బదిలీ చేయవచ్చని లేదా స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంపవచ్చని Amazon వెల్లడించింది.

మీరు ఎన్ని రూ. 2,000 నోట్లు డిపాజిట్ చేయాలనుకుంటున్నారో.. అందుకు తగ్గట్లు నగదును డెలివరీ బాయ్ కి అప్పగించాలి. మొత్తం తక్షణమే మీ Amazon Pay బ్యాలెన్స్ ఖాతాలో జమ అవుతుంది. రూ.2000 నోట్లను ఉపసంహరించుకోవాలని ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 30 లోపు రూ.2000 నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని కోరింది. అత్యధిక విలువ కలిగిన కరెన్సీని ఉపసంహరించుకోవడం వల్ల ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రతికూల పరిణామాలు ఉండవని ఆర్భీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రజలకు హామీ ఇచ్చారు.

సెప్టెంబర్ 30 గడువులోగా రూ.2,000 నోట్లు మెజారిటీ బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వస్తాయని భావిస్తున్నారు. అయితే చాలా మంది రూ.2000 నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. వారికి కోసం Amazon క్యాష్ లోడ్ చాయిస్ మంచి ఎంపికని నిపుణులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications