అమెజాన్‌ను నిషేధించండి: టాయ్‌లెట్ కవర్లపై హిందూ దేవతల ఫోటోలు..నెటిజెన్ల ఆగ్రహం
ముంబై: ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ మరోసారి వివాదాల్లో కూరుకుపోయింది. హిందూ దేవుళ్ల ఫోటోలు ఉన్న టాయ్‌లెట్ కవర్లను తమ వెబ్‌సైట్‌పై అమ్మకానికి పెట్టారు. ఇది అమెరికాలోని అమెజాన్ వెబ్‌సైట్‌పై కనిపించింది. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెజాన్‌ను నిషేధించాలంటూ ట్వీట్ చేశారు. చాలామంది ఈ-కామర్స్ వెబ్ సైట్ అమెజాన్‌ను నిషేధించాలని చెబుతూ అదే సమయంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను అమెజాన్ సంస్థపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే అమెజాన్ సంస్థ దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
2017లో కూడా భారత జెండా కలిగిన డోర్ మ్యాట్లను కెనడాకు చెందిన అమెజాన్ వెబ్‌సైట్ అమ్మకానికి ఉంచడంతో సుష్మా స్వరాజ్ సీరియస్ అయ్యారు. దీంతో భారత్‌లో పనిచేస్తున్న అమెజాన్ ఉద్యోగుల వీసాలను రద్దు చేస్తామని హెచ్చరించారు. దీంతో దిగొచ్చిన అమెజాన్ సంస్థ క్షమాపణ చెప్పింది.

ఇంకా ఇది మరువక ముందే మళ్లీ హిందువుల దేవతల ఫోటోలతో అమెజాన్ సంస్థలో టాయ్‌లెట్ కవర్లు, యోగా మ్యాట్లు, స్నీకర్స్, రగ్స్, ఇతర వస్తువులు దర్శనమిచ్చాయి. అయితే విషయం తెలిసిన వెంటనే ఆ వస్తువులను అమ్మకాల జాబితా నుంచి తొలగించింది. 2017లో కూడా అమెజాన్ సంస్థ ఇలానే చేసింది. హిందువు దేవుళ్ల ఫోటోలతో కూడిన వస్తువులను అమ్మకానికి పెట్టగానే పెద్ద ఎత్తున దుమారం రేగడంతో వెంటనే జాబితా నుంచి ఆ వస్తువులను తొలగించింది.
-
ఈ పొదల మాటున నక్కిన భయంకర జంతువును గుర్తించగలరా? -
ఏడవడానికి కూడా రేటు.. బిజినెస్ అంటే ఇతనిదే! -
ఈ అడవిలో దాగి ఉన్న చిన్న ఎలుగుబంటి ఎక్కడుందో కనిపెట్టగలరా..? -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్












Click it and Unblock the Notifications