ఫ్లిప్‌కార్ట్‌కు కౌంటర్‌: మే 13 నుండి 16 వరకు అమెజాన్ భారీ డిస్కౌంట్ సేల్స్

న్యూఢిల్లీ: దేశీయ ఈ - కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఇటీవల ప్రకటించిన బిగ్ షాపింగ్ డేస్‌ సేల్‌కు అమెజాన్ కూడ కౌంటర్‌గా బిగ్ డీల్స్, డిస్కౌంట్ సేల్స్‌ను ప్రకటించింది. మే 13 నుండి మే 16 వ, తేది వరకు అమెజాన్ డిస్కౌంట్లతో బిగ్ సేల్స్‌ను ప్రకటించనుంది.

మే 13 నుండి16వ తేది వరకు బిగ్ డీల్స్ ,డిస్కౌంట్లతో అమెజాన్ బిగ్ సేల్స్‌ను ప్రకటించింది. ఫ్లిప్ కార్ట్ కూడ మే 13 నుండి 16 వరకు ఇదే తరహ డిస్కౌంట్ సేల్స్‌ను ఇదివరకు ప్రకటించింది.

అమెజాన్‌ ఈ సేల్‌ కింద మొబైల్‌ ఫోన్లు, కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌, ఫ్యాషన్‌, లార్జ్‌ అప్లియెన్సస్‌, టీవీలు, స్పోర్ట్‌లు, ఫిట్‌నెస్‌ వంటి పలు ఉత్పత్తులపై పలు డీల్స్‌ను అందించనుంది. క్యాష్‌బ్యాక్‌లు, నో-కాస్ట్‌ ఈఎంఐలు, ఎక్స్చేంజ్‌ డిస్కౌంట్లను అమెజాన్‌ ఆఫర్‌ చేయబోతోంది. సుమారు 1000కి పైగా బ్రాండ్‌లలో 40వేల డీల్స్‌ను అందించనున్నట్టు అమెజాన్‌ ప్రకటించింది.

Amazon Summer Sale Announced to Take on Flipkart Big Shopping Days Sale

స్మార్ట్‌ఫోన్లపై 35 శాతం వరకు డిస్కౌంట్లను అమెజాన్‌ ఆఫర్‌ చేయనుంది. హానర్‌ 7ఎక్స్‌ డిస్కౌంట్‌ దీనిలో ప్రత్యేకంగా నిలువనుంది. రూ.10వేల వరకు విలువతో నోకియా 7 ప్లస్‌ ఈ సేల్‌లో విక్రయానికి వస్తోంది. రియల్‌మి 1 కూడా తొలిసారి ఈ సేల్‌లో అందుబాటులోకి వస్తోంది. కేవలం యాప్‌పై అందించే డిస్కౌంట్లు ఆ నాలుగు రోజుల సేల్‌లో రాత్రి 8 గంటల నుంచి అర్థరాత్రి వరకు లైవ్‌గా అందుబాటులో ఉంటాయి. యాప్‌లో షాపింగ్‌ చేసిన ఎంపికైన కొనుగోలుదారులకు రూ.4 లక్షల వరకు బహుమతులు అందుకోనున్నారు.

మొబైల్‌ యాక్ససరీస్‌పై 80 శాతం వరకు డిస్కౌంట్లు, డీల్స్‌ అందుబాటులో ఉంటాయి. ఫోన్‌ కేసులపై 70 శాతం పవర్‌బ్యాంకులపై 70 శాతం వరకు తగ్గింపును అమెజాన్‌ ప్రకటించింది. ల్యాప్‌టాప్‌లు రూ.20వేల వరకు డిస్కౌంట్లతో సేల్‌కు వస్తున్నాయి. పీసీ యాక్ససరీస్‌పై 50 శాతం తగ్గింపు ఇవ్వనున్నట్టు అమెజాన్ ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+