పట్టిసీమ పునాదితో టిడిపికి సమాధే: అంబటి
హైదరాబాద్: ఏపి సిఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం పార్టీపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పట్టిసీమ ప్రాజెక్టు పునాది తెలుగుదేశం పార్టీకి సమాధిగా మారబోతోందని ఎద్దేవా చేశారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రాజెక్టుల యాత్రకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని ఆయన అన్నారు. వైయస్ జగన్‌పై తెలుగుదేశం నేతలు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

జగన్‌పై బురద జల్లడం మానుకోవాలని ఆయన తెలుగుదేశం పార్టీ నేతలకు హితవు పలికారు. రూ. 300 కోట్ల ముడుపులకు కక్కుర్తి పడి ప్రారంభించిన పట్టిసీమ ప్రాజెక్టు చివరకు తెలుగుదేశం పార్టీకి శనిగా మారబోతోందని ఆయన జోస్యం చెప్పారు.
ఇప్పటికైనా పట్టిసీమను పక్కన పెట్టి పోలవరాన్ని పూర్తి చేయాలని అంబటి రాంబాబు ఏపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శేషాచలం ఎన్‌కౌంటర్‌పై సిఎం చంద్రబాబు నోరు మెదపకపోవడానికి కారణమేంటో అర్థంకావడం లేదన్నారు. దీనిపై చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.












Click it and Unblock the Notifications