చెత్త: ఎయిర్ ఇండియాపై బాలీవుడ్ భామ వ్యాఖ్య
ముంబై: భారత ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిరిండియాపై బాలీవుడ్ నటి అమీషా పటేల్‌కు ఎక్కడ లేని కోపం వచ్చింది. అదో చెత్త సంస్థ అంటూ ఆమె వ్యాఖ్యానించింది. ఎయిరిండియాపై ఆమెకు కోపం రావడానికి కారణం లేకపోలేదు.
Air India is the shittiest airline on earth.. Staff is unhelpful
— ameesha patel (@ameesha_patel) July 12, 2016
'భయ్యాజీ సూపర్ హిట్' అనే సినిమా షూటింగ్ కోసం సహ నటులు సన్నీడియోల్, అర్షద్ వార్సీతో కలిసి బెనారస్ వెళ్లేందుకు ఎయిరిండియా విమానంలో బిజినెస్ క్లాస్ టికెట్లు బుక్ చేసుకుంది. అయితే చివరి నిమిషంలో ఆమె ఎకానమీ క్లాస్‌లో పర్యటించాల్సి వచ్చింది.
Off on the worst airline air India ..w. @IAMSUNNYDEOL n @ArshadWarsi .. For a longgg schedule of bhaiyaji superhit pic.twitter.com/sG4plbJO8P
— ameesha patel (@ameesha_patel) July 12, 2016
దీంతో తీవ్ర అసౌకర్యానికి గురైన ఆమె ట్విట్టర్‌లో ఎయిరిండియాపై విరుచుకుపడింది. అదో చెత్త సంస్థ అని ఆరోపించింది. ఇటీవలే తన జన్మదినాన్ని బ్యాంకాక్‌లో ఘనంగా జరుపుకున్న అమీషా మాడ్రిడ్‌లో జరిగిన ఇఫా వేడుకల్లో పాల్గొన్న విషయం తెలిసిందే.
Air India.. Constant delays .. Suddenly a business class flight becomes all economy last minute.. Staff doesn't want to help ..
— ameesha patel (@ameesha_patel) July 12, 2016












Click it and Unblock the Notifications