టైంకాదు: రష్యాతో భారత్ సంబంధాల పైన అమెరికా, పారికర్‌పై పాక్
న్యూఢిల్లీ: రష్యాతో భారత్ ఇటీవల పలు ఒప్పందాలు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. దీని పైన అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. రష్యాతో భారత్ సంబంధాలకు తమకు ఎటువంటి ఇబ్బంది లేదని కానీ, ఇది సరైన సమయం కాదని అమెరికా పేర్కొంది.
గత కొద్ది రోజులుగా రష్యాతో వర్తక సంబంధాలకు సమయం కాదని అమెరికా ప్రకటిస్తోంది. దీనిపై అమెరికా విదేశాంగ శాఖ అధికారి మాట్లాడుతూ.. రష్యాతో భారత్ సంబంధాలు నెరపకూడదని కాదని, కానీ అంతర్జాతీయంగా రష్యాకు వ్యతిరేకంగా ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ఇది సరైన సమయం కాదన్నారు.

భారత దేశంలో రాష్యా ప్రధాని వ్లాదిమిర్ పుతిన్ పర్యటన అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా పర్యటన పైన ఎలాంటి ప్రభావం ఉండదని చెప్పారు. భారత్ తమకు ముఖ్యమైన భాగస్వామి అన్నారు.
తీవ్రవాద దాడులను ప్రేరేపిస్తే ధీటైన సమాధానం చెప్పక తప్పదన్న రక్షణ మంత్రి మనోహర్ పారికర్ వ్యాఖ్యల పైన పాకిస్తాన్ స్పందించింది. ఈ ప్రకటనలు శాంతికి దోహతం చేయవని అభిప్రాయపడింది. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తే గట్టిగా బదులు తప్పదని పారికర్ శుక్రవారం హెచ్చరించారు. దాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదులు పాకిస్తాన్ నుండి వచ్చారనేది బహిరంగ రహస్యమన్నారు. దీనిపై పాకిస్తాన్ ఘాటుగా స్పందించింది.












Click it and Unblock the Notifications