వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జర్మనీ నుంచి ఆక్సిజన్ ప్లాంట్లు దిగుమతి -రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఎయిర్ లిఫ్ట్ -వారంలోనే అందుబాటులోకి

|
Google Oneindia TeluguNews

భారత్ లో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి రోజురోజుకూ ప్రమాదరకంగా మారుతోంది. రోజువారీ కొత్త కేసుల్లో ప్రపంచ రికార్డులు దాటేసి, వేలకొద్దీ మరణాలు సంభవిస్తున్నాయి. గడిచిన రెండు వారాలుగా కొత్త కేసులు భారీగా వస్తుండటంతో యాక్టివ్ కేసులు పెరిగి, ఆస్పత్రులన్నీ నిండుకోవడం, ఆక్సిజన్ కొరత ఏర్పడటం తెలిసిందే. పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్‌ సంక్షోభాన్ని నివారించే దిశగా కేంద్రం కీలక చర్యలకు ఉపక్రమించింది..

కరోనా విలయం: షాకింగ్ రిపోర్ట్ -మే15 కల్లా పతాక స్థాయికి వైరస్ వ్యాప్తి -35లక్షల కేసులు -తగ్గేదెప్పుడు?కరోనా విలయం: షాకింగ్ రిపోర్ట్ -మే15 కల్లా పతాక స్థాయికి వైరస్ వ్యాప్తి -35లక్షల కేసులు -తగ్గేదెప్పుడు?

మొత్తం 23 ప్లాంట్లు దిగుమతి

మొత్తం 23 ప్లాంట్లు దిగుమతి

పారిశ్రామిక అవసరాల కోసం వాడుతోన్న ఆక్సిజన్ ను మెడికల్ అవసరాల కోసం తరలిస్తూ, దేశవ్యాప్తంగా పలు ప్లాంట్ల నుంచి 'ఎక్స్‌ప్రెస్‌' వేగంతో ఆక్సిజన్‌ కంటెయినర్లను తరలిస్తున్నారు. అయినప్పటికీ ఆక్సిజన్‌ కొరత తీరడం లేదు. దీంతో అప్రమత్తమైన భారత్‌, ఆక్సిజన్‌ ప్లాంట్లను జర్మనీ నుంచి దిగుమతి చేసుకునేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా జర్మనీ నుంచి దాదాపు 23 మొబైల్‌ ఆక్సిజన్‌ జనరేషన్ ప్లాంట్లను విమానాల ద్వారా తరలించనుంది.

ఇక జస్టిస్ రమణ చేతికి న్యాయ దండం -బాగా పనిచేశా, సంతృప్తిగా పదవీ విరమణ: జస్టిస్ బోబ్డే భావోద్వేగంఇక జస్టిస్ రమణ చేతికి న్యాయ దండం -బాగా పనిచేశా, సంతృప్తిగా పదవీ విరమణ: జస్టిస్ బోబ్డే భావోద్వేగం

ఆక్సిజన్ ఎయిర్ లిఫ్ట్..

ఆక్సిజన్ ఎయిర్ లిఫ్ట్..

యూరప్ దేశమైన జర్మనీలో మొబైల్‌ ఆక్సిజన్‌ ప్లాంట్లు విరివిగా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం భారత్ లో నెలకొన్న ఆక్సిజన్ కొరతను తీర్చేదిశగా కేంద్ర ప్రభుత్వం జర్మనీ నుంచి ఆక్సిజన్ ప్లాంట్లను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. అక్కడి నుంచి ప్లాంట్లను తీసుకొచ్చే బాధ్యతను రక్షణశాఖకు అప్పగించింది. యుద్ధ విమానాల ద్వారా జర్మనీ నుంచి ప్లాంట్లు తరలిస్తామని, వాటి నుంచి ఆక్సిజన్ ను వారం రోజుల్లోనే అందుబాటులోకి తెస్తామని రక్షణ శాఖ పేర్కొంది. కాగా,

ముందు రక్షణ శాఖకు, ఆ తర్వాతే..

ముందు రక్షణ శాఖకు, ఆ తర్వాతే..


జర్మనీ నుంచి తీసుకొచ్చే ఆక్సిజన్ ప్లాంట్లను తొలుత రక్షణశాఖ ఆధ్వర్యంలోని కొవిడ్‌ కేంద్రాల్లో(ఏఎఫ్‌ఎంఎస్‌) వాడనున్నారు. ఆ తర్వాతే ఇతర ప్రాంతాలకు తరలించనున్నారు. కేవలం వారం రోజుల్లోనే ఈ మొబైల్‌ ప్లాంట్లను అందుబాటులోకి తెస్తామన్న రక్షణ శాఖ.. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల మధ్య అవసరమైన ఆక్సిజన్‌ కంటెయినర్లను యుద్ధవిమానాల ద్వారా వాయుసేన చేరవేస్తోన్న విషయాన్ని గుర్తు చేసింది. కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో రక్షణ శాఖ తరపున పౌరులకు వీలైన సదుపాయాలు అందించాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇప్పటికే ఉన్నతాధికారులకు సూచించారు. పలు కంటోన్మెంట్‌ ఆసుపత్రులను కొవిడ్‌ రోగులకు అందుబాటులోకి తీసుకురాగా.. రక్షణశాఖ తరపున వైద్య పరికరాలు, సిబ్బంది కొవిడ్‌ రోగుల సేవల్లో నిమగ్నమయ్యాయి.

English summary
The Defence Ministry has decided to airlift 23 mobile oxygen generating plants from Germany as several states reeled under an acute shortage of medical oxygen due to a massive surge in coronavirus cases, officials said today. They said each plant will have a capacity to produce 40 litres of oxygen per minute and 2,400 litres every hour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X