జల్లికట్టు దెబ్బ: ఇప్పుడు నేను అవమానంగా భావిస్తున్నా.. హీరో ధనుష్
జల్లికట్టుకు మద్దతుగా సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు ధనుష్ ఆగ్రహం వ్యక్తం చేసారు. శాకాహారి అయిన తనకు 2012లో పెటా హాటెస్ట్ వెజిటేరియన్ అవార్డు ఇచ్చిందని, దాని పట్ల విచారిస్తున్నానన్నారు.
చెన్నై: జల్లికట్టు కోసం తమిళనాడు అట్టుడుకుతోంది. నడిగర సంఘం జల్లికట్టుకు మద్దతు పలుకుతోంది. లారెన్స్, ప్రభుదేవా తదితర నటులు జల్లికట్టు కోసం జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
మరోవైపు, జల్లికట్టుకు మద్దతుగా సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు ధనుష్ ఆగ్రహం వ్యక్తం చేసారు. జల్లికట్టుకు మద్దతుగా, పెటాకు వ్యతిరేకంగా తమిళనాడులో ఆందోళనలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ధనుష్ పెటాకు మద్దతివ్వడం లేదని చెప్పారు.

2012లో పెటా హాటెస్ట్ వెజిటేరియన్‌గా నిలిచారు. ఇప్పుడు దీనిపై ఆయన మండిపడుతున్నారు. అప్పుడు తనకు పెటా అవార్డు ఇవ్వడంపై చింతిస్తున్నానని, అవమానంగా భావిస్తున్నానని వెల్లడించారు.
శాకాహారి అయిన తనకు 2012లో పెటా హాటెస్ట్ వెజిటేరియన్ అవార్డు ఇచ్చిందని, దాని పట్ల విచారిస్తున్నానన్నారు. తాను, తన కుటుంబ సభ్యులు ఎవ్వరూ పెటాలో భాగస్వాములు కారన్నారు. జల్లికట్టు నిర్వహణకు అనుమతి ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని కోరారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications