Middle Class Indians: అష్టకష్టాల్లో భారత మధ్యతరగతి ప్రజలు.. ఎక్కడ తప్పు జరుగుతోందంటే..

India's Middle Class: భారతదేశంలోని మిడిల్ క్లాస్ ప్రజలు భారీగా పెరిగిపోతున్న ఆర్థిక ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారు. కరోనా మహమ్మారి తర్వాత తొలిసారిగా వేతనాలు తగ్గటం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ప్రజలు తమ ఖర్చులను తగ్గించుకోవటం పరిస్థితులు ఉన్నట్లు ఇటీవలి సర్వే ప్రకారం తెలుస్తోంది. ఇటీవల కార్పొరేట్ కంపెనీల ఆదాయాలు పడిపోవటంతో పాటు హిందుస్థాన్ యూనీలివర్, నెస్లే వంటి సంస్థలు ఊహించిన దానికంటే నగరాల్లో ప్రజల నుంచి తక్కువ డిమాండ్ చూస్తున్నాయి.

ప్రజలు ఖర్చుచేయదగిన ఆదాయాన్ని ద్రవ్యోల్బణం తినేయటంతో రోజువారీ ఖర్చులతో పాటు పెద్ద ఖర్చులను కూడా తగ్గించారు. దీంతో గృహోపకరణాలు, కార్లు వంటి పెద్ద వస్తువులకు సైతం డిమాండ్ భారీగా తగ్గింది. ఇదే క్రమంలో ఆటో రంగంలోని దిగ్గజం మారుతీ సుజుకీ ఇటీవలి త్రైమాసికాల్లో రూరల్ డిమాండ్ 8 శాతం పెరుగుదలను చూడగా, నగరాల్లో డిమాండ్ 2 శాతం తగ్గటాన్ని నమోదు చేసింది. పెరుగుతున్న ఒత్తిడిలో, డిమాండ్‌ను ఉత్తేజపరిచేందుకు వడ్డీరేట్ల కోతలను వేగవంతం చేయాలని ఇటీవలి కాలంలో భారత ప్రభుత్వం సైతం సూచించిన సంగతి తెలిసిందే. అయితే రిజర్వు బ్యాంక్ మాత్రం ద్రవ్యోల్బణ నియంత్రణకు ప్రాధాన్యతనిస్తూ దృఢంగా ఉంది.

Amid Inflation and wages fall Indian Middle class in Financial Pressure Know details

ఆర్థిక వృద్ధి గణనీయంగా మందగించింది. సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 6.5%గా అంచనా వేయబడింది. ఇది ఆరు త్రైమాసికాల్లో బలహీనమైనది. బలహీనమైన కన్స్యూమర్ ఫైనాన్స్ వెనుక ఉన్న ప్రధాన కారకం అణచివేయబడిన ఆదాయ వృద్ధని మోతీలాల్ ఓస్వాల్ నిపుణులు పేర్కొన్నారు. ఇదే క్రమంలో మెట్రో నగరాల్లో హౌసింగ్ కాస్ట్ భారీగా పెరిగింది. ఇంటి అద్దెలు సైతం పెరిగిపోవటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ ధరలు ఏకంగా 23 శాతం పెరుగుదలను చూశాయి. ఈ క్రమంలో ముఖ్యంగా బెంగళూరు, ముంబై నగరాల్లో భారీ పెరుగుదల కనిపించింది. అద్దెలు, యుటిలిటీలు ప్రస్తుతం పట్టణ ఆదాయాల్లోకి ప్రవేశించి, విచక్షణతో కూడిన ఖర్చులకు తక్కువ స్థలాన్ని మిగులుస్తున్నాయి.

ప్రస్తుతం పెరుగుతున్న గృహ ఖర్చులు, అదే స్థాయిలో పెరగని ఆదాయాలు భారతీయ మిడిల్ క్లాస్ ప్రజలను ఆర్థిక ఒత్తిళ్లలోకి నెట్టేస్తున్నాయని కార్పొరేట్ కంపెనీల ఉన్నత స్థాయి అధికారులు చెబుతున్నారు. ఇది మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తి తగ్గుదలకు దారితీసినట్లు వెల్లడైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+