చిన్నారి ఏం పాపం చేశాడు: సొంత కొడుకును ఉరి తీశాడు..వీడియో రికార్డ్ చేసిన కూతరు
బెంగళూరు: బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన సొంత కొడుకునే ఉరితీసిన ఘటన వెలుగు చూసింది. హెచ్ఏఎల్ సమీపంలోని విభూతినగర్‌లో ఈ ఘటన జరిగింది. సురేష్ బాబు అనే 43 ఏళ్ల సేల్స్ ఎగ్జిక్యూటివ్ 12 ఏళ్ల తన కుమారుడిని ఫ్యాన్‌కు ఉరివేశాడు. అనంతరం తన భార్యను కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిందిగా బలవంతం పెట్టాడు. దీన్నంతటినీ సురేష్ కూతురు మొబైల్ ఫోన్‌లో రికార్డు చేసింది.

సామూహిక ఆత్మహత్యకు ప్రయత్నం
సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న సురేష్ కుటుంబంలో ఆర్థిక సమస్యలు తీవ్రతరం అయ్యాయి. వీటిని ఎదుర్కొనలేకనే ఆత్మహత్య చేసుకోవాలని కుటుంబం భావించిందని పోలీసులు తెలిపారు. చిట్‌ఫండ్ వ్యాపారం పెట్టి అందులో నష్టాలను చవిచూసినట్లు పోలీసులు చెప్పారు. ఇక ఆర్థిక ఊబిలో కూరుకుపోయిన సురేష్ కుటుంబం కొందరి ప్రైవేట్ వ్యక్తుల నుంచి వడ్డీకి డబ్బులు తీసుకున్నారని అయితే సకాలంలో వారు దాన్ని చెల్లించలేకపోయినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అప్పుల వారు వేధిస్తుండటంతో ఇక కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకోవాలని భావించిందని పోలీసులు వివరించారు.

తమ్ముడిని వదిలేయాలంటూ బతిమలాడిన అక్క
ఇక 3 నిమిషాల 47 సెకన్ల నిడివి ఉన్న వీడియోలో తన కొడుకు వరుణ్‌ను సురేష్ బలవంతంగా సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేస్తున్నట్లుగా కనిపించింది. వరుణ్ గిలగిల కొట్టుకుంటుండగా భార్య గీతా, కూతురు ఆ దృశ్యాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఆసమయంలో తన తమ్ముడిని వదిలేసి అందరం చనిపోదాం అని సురేష్ కూతురు బిగ్గరగా ఏడవటం వీడియోలో రికార్డు అయ్యింది. ఇక కూతురు రికార్డు చేస్తున్న వీడియోను గమనించిన గీతా వెంటనే ఫోనును తన చేతిలోనుంచి లాక్కొంది. దీంతో వీడియో అక్కడి వరకే రికార్డు అయ్యింది. ఆ తర్వాత గీతా కూడా ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తెలిపారు.

కొడుకును భార్య చంపి ఆత్మహత్య చేసుకుందంటూ బుకాయింపు
ప్రాణాలతో బయటపడ్డ సురేష్.. తాను ఆత్మహత్యకు పాల్పడుతుండగా తన కూతురు వద్దని వారించిందని పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నాడు. ముందుగా తన కొడుకును చంపింది తన భార్య గీతా అని ఆ తర్వాత ఆమె కూడా మృతి చెందిందని సురేష్ పోలీసులకు చెప్పాడు. పోలీసుల దర్యాప్తులో మొబైల్ ఫోను దొరకడం అందులో రికార్డు అయిన వీడియో బయటపడటంతో అసలు సంగతి వెలుగు చూసింది. సురేష్‌పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
-
300 లోడింగ్.. చేసేది ఆ జట్లేః టీమిండియా లెజెండర్ -
SRH.. ఏదో తేడాగా ఉందేంటీ -
రేపే ఐపీఎల్ ఓపెనర్: మెట్రో రైల్ లో ఫ్రీ ట్రావెల్: మంత్రులకూ -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..?












Click it and Unblock the Notifications