కొత్త పార్టీ దిశగా అళగిరి అడుగులు, రజనీకాంత్‌తో భేటీ

మరో రెండు నెలల్లో సొంత పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు అళగిరి ఆ తర్వాత ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు రజనీతో అళగిరి భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
భేటీ అనంతరం అళగిరి మాట్లాడుతూ... రజనీకాంత్ తనకు స్నేహితుడని, అందుకే కలిశానని చెప్పారు. తన తనయుడి సినిమా కార్యక్రమానికి రావాలని కోరినట్లు చెప్పారు. తమ భేటీలో రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు.
కాగా, అళగిరి కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారనే విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ... లోకసభ ఎన్నికల తర్వాత కొత్త పార్టీపై ఆలోచిస్తానని చెన్నైలో చెప్పారు. తన కేడర్‌తో చర్చించాక వచ్చే రెండు నెలల్లో నిర్ణయం తీసుకుంటానని ఆయన ఇటీవల చెప్పారు.
రెండు నెలల కిందట పార్టీకి రెబల్ నేతగా మారి తండ్రి కరుణను ధిక్కరించిన అళగిరిపై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవడంతో బహిష్కృత వేటు పడింది. అప్పటి నుంచి అళగిరి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. డిఎంకె లోకసభ అభ్యర్థుల లిస్టులో అళగిరి పేరు కూడా లేదు. దీంతో అసహనానికి గురైన ఆయన కొత్త పార్టీ దిశలో అడుగులు వేస్తున్నారు.












Click it and Unblock the Notifications