విభజనపై అమీషా పటేల్ ట్వీట్: కిరణ్‌ రెడ్డికి కితాబు

Amisha Patel
హైదరాబాద్: ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ దృష్టి పడింది. రాష్ట్ర విభజనపై ఆమె ఎక్కడ లేని ఆసక్తి కనబరిచింది. రాష్ట్ర విభజనపై ఆమె ట్విట్టర్‌లో తన వ్యాఖ్యలను పోస్టు చేసింది.

రాష్ట్రాన్ని చీల్చేందుకు జరుగుతున్న కుట్ర, కుతంత్రాల్ని అడ్డుకోవడంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా శ్రమిస్తున్నారని, ఆయనను తప్పక అభినందించాల్సిందేనని ఆమె ట్విట్టర్లో వ్యాఖ్యానించింది. భారతీయులు ఎప్పుడూ సమైక్యంగానే ఉండాలని, విభజించు పాలించు అన్న బ్రిటిష్ వాదంతో మనవాళ్ళు నష్టపోరాదని తెలిపింది.

అమీషా పటేల్ వ్యాఖ్యలపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. తెలంగాణ గురించి తెలియకుండా మాట్లాడడం మంచిది కాదని వారంటున్నారు. వారి వ్యాఖ్యలపై కూడా అమీషా ప్రతిస్పందించింది. ఏది మంచో ఏది చెడో ప్రజలే అర్థం చేసుకుంటారని ట్వీట్ చేసింది.

గతంలో తెలుగు సినీ నటులు రాష్ట్ర విభజన వ్యవహారంలో కాలు పెట్టి చేతులు కాల్చుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌ను వ్యతిరేకించిన సినీ నటుల సినిమాలను బహిష్కరించారు. వారి సినిమా షూటింగులను అడ్డుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+