ఎన్నికల వేళ.. ఆ రాజకీయ పార్టీపై ఉక్కుపాదం మోపిన అమిత్ షా
Amit Shah: దేశం.. సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనడానికి సన్నద్ధమౌతోంది. ఇంకో రెండు, మూడు నెలల్లో షెడ్యూల్ వెలువడొచ్చు. ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోన్నాయి. వ్యూహ, ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. గెలుపు కోసం సర్వశక్తులనూ ఒడ్డుతున్నాయి.
ఈ పరిస్థితుల మధ్య కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. జమ్మూ కాశ్మీర్ ప్రధాన కేంద్రంగా రాజకీయ కార్యకలాపాలను కొనసాగిస్తూ వస్తోన్న తెహ్రీక్-ఇ- హురియత్‌పై ఉక్కుపాదం మోపింది. ఈ పార్టీని అసాంఘిక కార్యకలాపాల సంస్థగా గుర్తించింది. అసాంఘిక వ్యవహారాల నిరోధక చట్టం (UAPA) కిందికి చేర్చింది.

2004లో ఏర్పాటైన పార్టీ ఇది. సయ్యద్ అలీ షా గిలానీ దీన్ని నెలకొల్పారు. జమాతె ఇస్లామీ కాశ్మీర్ నుంచి వేరుపడిన తరువాత ఆయన తెహ్రీక్-ఇ- హురియత్‌ను స్థాపించారు. జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికలను నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం సంసిద్ధతను వ్యక్తం చేసిన వేళ.. ఈ పార్టీపై కఠిన చర్యలు తీసుకుంది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.
తెహ్రీక్-ఇ-హురియత్‌ను వేర్పాటు వాద సంస్థగా గుర్తించినట్లు అమిత్ షా తెలిపారు. ఈ మేరకు ఓ ట్వీట్‌ను పోస్ట్ చేశారు. జమ్మూ కాశ్మీర్, లఢక్‌లల్లో ఎలాంటి అశాంతియుత వాతావరణాన్ని తాము కోరుకోవట్లేదని, అలాంటి కార్యకలాపాలన్నింటిపైనా కఠిన చర్యలను తీసుకుంటామని అన్నారు. ఇందులో భాగంగానే హురియత్‌ను యూఏపీఏ కిందికి చేర్చినట్లు చెప్పారు.
భారత్ నుంచి జమ్మూ కాశ్మీర్‌ను వేరు చేయడానికి, అక్కడ ఇస్లామిక్ రాజ్యాన్ని నెలకొల్పాలనే లక్ష్యంతో హురియత్ నాయకులు పని చేస్తోన్నారని అమిత్ షా పేర్కొన్నారు. భారత్‌కు వ్యతిరేకంగా దుష్ర్పచారానికి దిగుతున్నారని, జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పూర్తిస్థాయిలో మద్దతు పలుకుతున్నారని అన్నారు.












Click it and Unblock the Notifications