ఒవైసీపై హత్యాయత్నం: అమిత్ షా కీలక ప్రకటన: తెలంగాణ పోలీసులు రెడీగా ఉన్నారంటూ

హైదరాబాద్: అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధినేత, హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీపై ఈ నెల 3వ తేదీన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకున్న హత్యాయత్న ఘటనపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు. కాల్పుల ఘటన అనంతరం జరిగిన పరిణామాలను సభకు వివరించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలను సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు.

హాపుర్ జిల్లా పిల్ఖువా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛజార్సీ టోల్‌ప్లాజా వద్ద ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఒవైసీ కారుపై కాల్పులు జరిపారని అమిత్ షా అన్నారు. ఈ ఘటన నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారని చెప్పారు. కారు కిందిభాగంలో మూడు బుల్లెట్ గుర్తులు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారని పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, దర్యాప్తు శరవేగంగా సాగుతోందని వివరించారు.

Amit Shah has urged AIMIM chief Asaduddin Owaisi to accept the offer of Z category security

హాపుర్‌లో ఒవైసీ ఎలాంటి ముందస్తు కార్యక్రమాన్ని షెడ్యూల్ చేసుకోలేదని అమిత్ షా అన్నారు. ఫలితంగా- ఆయన వస్తున్నారనే ముందస్తు సమాచారం జిల్లా పాలన, పోలీసు అధికారుల వద్ద లేదని చెప్పారు. హాపుర్ మీదుగా ఒవైసీ వెళ్తున్నారనే విషయం మాత్రం జిల్లా కంట్రోల్ రూమ్‌కు అందిందని అన్నారు. కాల్పుల ఘటన తరువాత ఒవైసీ సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నారని చెప్పారు. కాల్పులు చోటు చేసుకున్న వెంటనే పోలీసులు యుద్ధ ప్రాతిపదికన స్పందించారని అమిత్ షా చెప్పారు.

ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారని, వారి వద్ద నుంచి ఓ పిస్టల్, ఆల్టో కారును స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. సమాచారం అందిన వెంటనే ఫోరెన్సిక్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని, సాక్ష్యాధారాలను సేకరించాయని అమిత్ షా చెప్పారు. ఈ ఘటన అనంతరం ఒవైసీకి తాము బుల్లెట్ ప్రూఫ్‌తో కూడిన జెడ్ సెక్యూరిటీ భద్రతను కల్పించామని, దీన్ని ఆయన తిరస్కరించారని అన్నారు. జెడ్ సెక్యూరిటీ భద్రతను ఒవైసీ తక్షణమే అంగీకరించాలని కోరుతున్నానని అమిత్ షా చెప్పారు.

ఒవైసీ అంగీకరించిన వెంటనే ఢిల్లీ, తెలంగాణ పోలీసులు ఆయనకు భద్రత కల్పించడానికి సిద్ధంగా ఉన్నాయని అన్నారు. ఆయన నిరాకరించడం వల్ల ఢిల్లీ, తెలంగాణ పోలీసులు భద్రతను ఇవ్వలేకపోయాయని అమిత్ షా స్పష్టం చేశారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో శాంతిభద్రతలను పరిరక్షించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాలు చర్యలు తీసుకున్నాయని అన్నారు. శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని తేల్చి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+