వెయిట్ అండ్ వాచ్: రజనీకాంత్ ఎంట్రీపై అమిత్ షా వ్యాఖ్య

రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై బిజెపి చీఫ్ అమిత్ షా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హెడ్‌లైన్ కోసం ప్రయత్నిస్తున్నారని అన్నారు.

హైదరాబాద్: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇండియా టుడేతో మాట్లాడుతూ ఆ వ్యాఖ్యలు చేసారు. తమిళనాడులో పట్టు కోసం సూపర్ స్టార్ రజనీకాంత్‌ను బిజెపి రంగంలోకి దింపే అవకాశం ఉందా, బిజెపి ప్రోద్బలంతో ఆయన పార్టీ పెట్టబోతున్నారా అని ఇండియా టుడే ప్రతినిధి అడిగారు.

దానికి అమిత్ షా సమాధానమిస్తూ "మీరు హెడ్‌లైన్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ అవకాశం నేను ఇవ్వను. ఏం జరుగుతుందో వేచి చూడండి.. వెయిట్ అండ్ వాచ్" అని అన్నారు. తమిళనాడు వ్యవహారాలకు సంబంధించి తమకు ఏ విధమైన పాత్ర లేదని ఆయన స్పష్టం చేశారు.

Amit Shah makes comment on Rajinikanth's political entry

తమిళనాడులో అస్థిరత ఉందని తాను అనుకోవడం లేదని, పన్నీర్ సెల్వం వ్యవహారంతో బిజెపికి సంబంధం లేదని ఆయన అన్నారు. పన్నీర్ సెల్వం వెనక బిజెపి ఉందనే ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. తమిళ రాజకీయాలపై ఆయన ఆ విధంగా స్పందించారు.

తమిళనాడులో గత పది రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు గురువారం తెర పడంది. పళని స్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బలనిరూపణకు గవర్నర్ విద్యాసాగర రావు పదిహేను రోజుల గడువు ఇచ్చినప్పటికీ సోమవారంనాడే ఆయన శాసనసభలో బలపరీక్షకు సిద్ధపడే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+