హిందీలో ఎంబీబీఎస్ కోర్సు పుస్తకాలు: తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్

భోపాల్: వైద్య విద్య(ఎంబీబీఎస్ కోర్సు)ను హిందీ మాధ్యమంలో కొనసాగించేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. హిందీ మాధ్యమంలో ఎంబీబీఎస్ కోర్సు పుస్తకాలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భోపాల్‌లో ఆవిష్కరించారు. దీంతో హిందీలో ఎంబీబీఎస్ కోర్సు ప్రారంభించిన తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 2022-23 విద్యా సంవత్సరానికిగానూ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మొదటి ఏడాది విద్యార్థులకు హిందీలో మెడిసిన్ ను బోధించనున్నారు. మొదట్లో అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ సబ్జెక్టుల పుస్తకాలు హిందీలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు.

Amit Shah releases Hindi MBBS text books: Madhya Pradesh is first state

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెడికల్, ఇంజినీరింగ్ కోర్సులను హిందీలో నేర్చుకోలేమనే భావనను తొలగించేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. హిందీ మాధ్యమంలో చదివి కూడా జీవితంలో ముందుకు సాగగలమనే ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు ఇదో ముందడుగని పేర్కొన్నారు.

మాతృ భాషలోనే విద్యా బోధన ఉండాలనే ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పమని సీఎం శివరాజ్ సింగ్ అన్నారు. ఇంగ్లీష్ తోపాటు హిందీ పుస్తకాలు కూడా అందుబాటులో ఉంటాయని, సాంకేతిక పదాలు మాత్రం ఇంగ్లీష్‌లోనే ఉంటాయని మధ్యప్రదేశ్ విద్యాశాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ స్పష్టం చేశారు. దేశంలో ఎంబీబీఎస్ కోర్సును హిందీలో తీసుకొచ్చిన తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచిందన్నారు.

కొత్త జాతీయ విద్యా విధానం ద్వారా ప్రధాని మోడీ విద్యార్థుల మాతృభాషకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని, ఇది చారిత్రాత్మక నిర్ణయమని అమిత్ షా వ్యాఖ్యానించారు. బీజేపీకి చెందిన శిరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం.. దేశంలో మొదటిసారిగా హిందీలో వైద్య విద్యను ప్రారంభించి, ప్రధానమంత్రి మోడీ కోరిక నెరవేర్చిందని అమిత్ అన్నారు. కాగా, భోపాల్‌లోని గాంధీ మెడికల్ కాలేజీలో 97 మంది నిపుణుల బృందం గత 232 రోజులుగా పుస్తకాలను ఇంగ్లీష్ నుంచి హిందీలోకి అనువదించే పనిలో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+