ఛాంపియన్స్ ట్రోఫీ: భారత్-పాక్ మ్యాచ్‌లపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఐసిసి ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో భారత్‌, పాకిస్థాన్‌ తలపడడానికి ఒకరోజు ముందు బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్‌ షా సంచలన వ్యాఖ్యలు చేశారు.

పాక్‌తో చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్: భారత్‌పైనే ఒత్తిడి

భారత్-పాక్ మ‌ధ్య‌ క్రికెట్ మ్యాచ్ అంటేనే ఎంతో ఆస‌క్తిక‌రంగా ఎదురుచూస్తారు అభిమానులు. అలాంటిది ఛాంపియ‌న్స్ ట్రోఫీలాంటి ప్ర‌తిష్టాత్మ‌క టోర్నీలో ఫైన‌ల్‌లోకి ప్ర‌వేశించిన ఆ జ‌ట్ల ఆట కోసం క్రికెట్ అభిమానులు ఎంత‌గానో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అమిత్ షా కీల‌క‌ వ్యాఖ్య‌లు చేశారు.

దీనికి ఓకే... అవి ఆడనివ్వం

దీనికి ఓకే... అవి ఆడనివ్వం

అంతర్జాతీయ టోర్నీల్లో పాకిస్తాన్‌తో భారత జట్టు ఆడడాన్ని అడ్డుకోబోమని అమిత్ షా స్పష్టం చేశారు. అయితే దాయాది దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడానికి వీల్లేదని ఉద్ఘాటించారు.

ఇదే తొలిసారి

ఇదే తొలిసారి

పాక్‌తో క్రీడా సంబంధాలపై అధికారంలో ఉన్న పార్టీ అగ్రనేత తమ వైఖరి తెలియజేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గత నెలలో దుబాయ్‌లో బీసీసీఐ, పీసీబీ సమావేశం సందర్భంగా కేంద్ర క్రీడల మంత్రి విజయ్‌ గోయెల్‌ సైతం ఇదే స్వరం వినిపించారు.

కుండబద్దలు

కుండబద్దలు

పొరుగుదేశం సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపేంత వరకూ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడడానికి వీల్లేదని విజయ్ గోయెల్ అప్పుడు తెలిపారు. 2007 నుంచి రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక క్రికెట్‌ సిరీస్‌లు జరగటం లేదు.

అమీతుమీ

అమీతుమీ

కాగా, చిరకాల ప్రత్యర్థుల మధ్య పతాక పోరు ఈ రోజు మధ్యాహ్నం జరగనుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా, ఫేవరెట్‌గా బరిలోకి దిగి అంచనాలకు తగ్గ ఆటతో ఫైనల్‌కు దూసుకొచ్చిన భారత్‌, టోర్నీని చెత్తగా ఆరంభించినా, తర్వాత అద్భుతంగా పుంజుకుని వరుస విజయాలతో తుదిపోరుకు అర్హత సాధించిన పాకిస్థాన్‌ అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. లండన్‌లోని ఓవల్‌ మైదానంలో ఈ రెండు జట్ల మధ్య ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ జరగనుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ruling out resumption of bilateral cricket ties between India and Pakistan anytime soon, BJP president Amit Shah on Saturday said the two countries would continue to play against each other in international tournaments.
Please Wait while comments are loading...