వారికి శిక్ష ఎలా ఉంటుందంటే..? అమిత్ షా సంచలనం..

దిల్లీ పేలుడు ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరోసారి స్పష్టం చేశారు. గుజరాత్ లోని మోతీభాయ్ చౌదరీ సాగర్ సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన అమిత్ షా.. అనంతరం ప్రసంగించారు. ప్రపంచంలో ఎవరైనా భారత్ పై ఇలాంటి దాడులకు పాల్పడాలంటే భయపడే విధంగా వాళ్లకు శిక్ష విధిస్తామని స్పష్టం చేశారు. కారు బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.

" ఎవరైతే ఈ పిరికిపంద చర్యకు పాల్పడ్డారో.. వారి వెనుక ఎవరున్నారో.. వారిని చట్టం ముందు నిలబెడతాం. వారిని కఠినంగా శిక్షిస్తాం. భారత ప్రభుత్వం, కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంది" అని అమిత్ షా స్పష్టం చేశారు. ఇక నవంబర్ 10 సాయంత్రం దిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద జరిగిన కారు బాంబు ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పేలుడు ధాటికి పరిసర ప్రాంతాల్లోని వాహనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.

ఇక ఈ ఘటన జరిగిన అనంతరం దిల్లీ లోని ఎల్‌ఎన్‌ జేపీ ఆస్పత్రికి వెళ్లారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అక్కడ బాధితులను పరామర్శించి వారి పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఘటనా స్థలిని పరిశీలించారు. పేలుడు ఘటనపై అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తామని తెలిపారు.

ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు సేకరించారు పోలీసులు. ఇప్పటికే అనుమానితులను అరెస్ట్ చేసి.. కస్టడీలోకి తీసుకున్నారు. అధికారులు ఇదే ఘటనపై విస్తృతంగా సమాచారం సేకరిస్తున్నారు. మొత్తం ఉగ్ర నెట్ వర్క్ ను నిర్మూలించేందుకు దర్యాప్తు చేస్తున్నారు. ఇక దిల్లీ బాంబు దాడిలో నిందితులుగా ఉన్న ముగ్గురు వైద్యులు అల్‌ ఫలాహ్‌ యూనివర్సిటీకి చెందినవారుగా ఎన్ఐఏ బృందం గుర్తించింది.

Amit Shah Vows Iron Fist Delhi Blast Culprits to Face Severe Punishment

వీళ్లంతా జైషే-ఈ- మహమ్మద్ టెర్రర్ గ్రూప్ సభ్యులుగా ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే యూనివర్సిటీకి గుర్తింపును రద్దు చేస్తూ.. అసోసియేషన్ ఆఫ్‌ ఆల్ ఇండియన్ యూనివర్సిటీస్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఆ యూనివర్సిటీకి నాక్ (NAAC) కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+